మన దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి ...రోజు రోజుకి పెరిగిపోతూ సామాన్యులను యిబ్బందులు పెడుతున్నాయి .అయితే మన  రోజువారి అవసరాలలో ముఖ్య మైనవి పాలు ...మరి పాల ధర  పెట్రోల్ రేటుకంటే ఎక్కువ అయితే . అబ్బో అలా  అయితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంటారా . కానీ ఇక్కడ ఓ దేశంలో అదే జరిగింది .అది ఏ దేశమో కాదు మన దేశానికి పక్కనే ఉన్న పాకిస్థాన్ లో .


పెట్రోల్ రేటుకి రెక్కలు వచ్చాయనే మాట మీరు  వినుంటారు ...కానీ పాల రేట్లకి రెక్కలొచ్చాయని ఎప్పుడైనా విన్నారా ...కానీ పాకిస్థాన్ మాత్రం అది జరిగింది . మొహర్రం సందర్బంగా పాకిస్థాన్ లో  తీవ్ర పాల కొరత ఏర్పడింది .దీంతో పాల ధర అమాంతంగా పెంచేశారు అక్కడి వ్యాపారులు . మొహర్రం సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనే వారికోసం రోడ్డు పక్క భారీగా పాలు పండ్ల దుకాణాలు వెలిశాయి . కాగా  పాలకి డిమాండ్ ఎక్కువ రావటం తో కొరత ఏర్పడింది .90 రూపాయలు ఉన్న పాల ధర  పెట్రోల్ డీజీల్ ధరకంటే ఎక్కువయ్యింది . పాలధార పెరిగినప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు .పాకిస్థాన్  లోని కరాచీ, సింధ్ ప్రావిన్స్‌లో లీటర్ పాలు రూ.140కి చేరుకున్నాయని అక్కడి  స్థానిక మీడియా తెలిపింది.


ఇక్కడ పెట్రోల్ ధరలు కూడా ఏం తక్కువ లేవండోయ్ ... లీటరు పెట్రోల్ ధర 113  రూపాయలు  కాగా, డీజిల్ రూ.91కి గా ఉంది . కాగా ఇక్కడ పాల ధర పెట్రో ధరకి మించి 140  రూపాయలు పెరిగింది . అధికారుల పట్టించుకోక పోవటం వల్లే పాల ధర ఒక్కసారిగా 140  రూపాయలకి పెంచారని సమాచారం .కాగా  అక్కడి  కమిషనర్ కార్యాలయంలో మాత్రం పాల ధర రూ.94గానే పేర్కొన్నారట .



మరింత సమాచారం తెలుసుకోండి: