మొన్నటి వరకు స్వయం ప్రతి పత్తి గల  జమ్మూ కాశ్మీర్ లో   370 ఆర్టికల్  రద్దు చేసి స్వాతంత్ర ప్రతి పత్తి గల రాష్టం గా హక్కులు కల్పించింది భారత ప్రభుత్వం. అయితే   కాశ్మీర్ అంశం  పై పాకిస్తాన్  ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు  చేయటం మాత్రం ఆపటం  లేదు. 370 ఆర్టికల్   రద్దు  తర్వాత పాకిస్థాన్  భారత్ తో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంది. అయితే దీనివల్ల పాక్ ప్రజలు తీవ్ర  అవస్థలుపడుతున్నారని... అయినా తమ మాట ఎవ్వరు వినిపించుకుకోవటం  లేదని పాక్ మంత్రులు చెబుతున్నప్పటికీ.... ఇమ్రాన్ ఖాన్ మాత్రం భారత్ తో యుద్ధం  తప్పక చేస్తాం  అంటూ రోజుకో విధంగా యుద్ధం  అంశాన్ని  లేవనెత్తుతూనే ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. 

 

 

ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ విషయం లో భారత్ తో యుద్ధం గురుంచి మరోసారి    సంచలన వ్యాఖ్యలు  చేశాడు ఇమ్రాన్ ఖాన్. అల్ జాజీరాకి ఇచ్చిన  ఇంటర్వ్యూ  లో పాకిస్తాన్ యుద్దానికి ఎప్పుడు వ్యతిరేకం అంటూనే భారత్  తో అను యుద్ధం తప్పదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు ఇమ్రాన్ ఖాన్. భారత్ తో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయే పరిస్థితి వస్తే పాకిస్థాన్ కి రెండు అప్షన్ లు ఉంటాయని... ఒకటి లొంగి పోవటం... రెండు స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలు అర్పించటం... అయితే పాకిస్థాన్ ఎప్పుడు స్వేచ్ఛ కోసమే పోరాడుతుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యనించాడు.కాశ్మీర్ విషయంలో తాడో పేడో తేల్చుకొక తప్పదని అన్నారు.ఇదిలా ఉండగా తాజాగా పీవోకే లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ అక్కడ భారత్ పై నోరు పారేసుకున్నాడు.  కాశ్మీర్  అంశం భారత్ అంతర్గత వ్యవహారం అని... ఈ విషయం లో పాకిస్తాన్ జోక్యం అవసరం లేదని చెప్తుండగా భారత ప్రభుత్వం చెబుతుంది ... ఈ విషయం పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి పిర్యాదు చేసి కాశ్మీర్ పై ఆంక్షలు ఎత్తి వేసేలా చూస్తాం అని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: