సెప్టెంబర్ 1  ఇది వాహనదారులు గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఈరోజే కదా కేంద్రం కొత్త వాహన చట్టాన్ని అమలు చేసింది . వాహన జరిమానాలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది . ఈ నిర్ణయం తో పెను సంచలమే రేగింది ...వాహన దారులు ఈ భారీ జరిమానాలు మేము కట్టలేం బాబోయ్ అంటూ నిరసనలు తెలిపిన  ప్రయోజనం లేకుండా పోయింది .అయితే ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత  పోలీసులు మాత్రం జరిమానాలు విదించటానికి చాలా చురుకుగా పని చేస్తున్నారు . ఎంతలా నిబంధనలు ఉల్లంఘించే వారికే కాదు , ఉల్లంగించకున్న చలాన్లు రాసేస్తున్నారు . ఆటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని  ... బైక్ నడిపే వ్యక్తి సీట్ బెల్టు పెట్టుకోలేదని చలాన్లు రాస్తుడంటంతో వాహనాన్ని ముట్టుకోవాలన్న వాహన దారులు భయపడుతున్నారు .

తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ...అయితే ఈ సారి పోలీసులు చలాన్ విధించింది ఏ కారో , బైకో, ఆటోనో కాదండి...ఎద్దుల బండికి . అవును ఎద్దుల బండికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు అక్కడి పోలీసులు  .  


ఉత్తరాఖండ్ రాష్ట్రము లోని డెహ్రాడూన్ కు చెందిన హాసన్ అనే వ్యక్తి తన పొలం పక్కన ఎద్దుల బండి నిలిపాడు . కాగా దాన్ని గమనించిన పాలీసులు హాసన్ అనే రైతు ఇసుక ను అక్రమంగా  తరలిస్తుడని అనుమానించి ...వెయ్యి రూపాయల జరిమానా విధించారు . పోలీసుల తీరుతో చిర్రెత్తిపోయిన రైతు హాసన్ అసలు ఎద్దుల బండికి చలాన్ విధించటం  ఏంటి ...అసలు మోటార్ వాహనాల చట్టంలో ఈ నిబంధన ఉందా అంటూ మండిపడ్డాడు .దీంతో తప్పు తెలుసుకున్న పోలీసులు చలాన్ వెనక్కి తీసుకుని  అక్కడి నుండి మెల్లగా అక్కడినుండి  జారుకున్నారు . ఏది ఏమైనా నూతన మోటార్ చట్టం వచ్చినప్పటి నుండి పోలీసులు చలాన్లు విదించటానికి అతి ఉత్సాహం చూపిస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: