ఈ నెల 15 న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు  వద్ద జరిగిన బోట్ ప్రమాదంలో   ఎంతో మంది జీవితాలు  చిన్నా భిన్నం అయిపోయాయి. ఈ బోటులో 73 మంది ప్రయాణించినట్లు అందరూ భావిస్తున్నారు. అయితే ఈ బోటులో ప్రయాణించింది 73 మంది కాదని మొత్తం బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య  77 అని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పాపికొండల పర్యటనకు వెళ్లిన బోట్  ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి పోయింది. అయితే ఈ ప్రమాదం నుండి 27 మంది ప్రయాణికులు సురక్షితంగా  బయటపడగా... మిగతా ప్రయాణికులు మృతదేహాలు కోసం అధికారులు ముమ్మర  చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని మృతదేహాలను వెలికి తీయగా.... మరికొన్ని మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది.

 

 

 అయితే బోటులో మొత్తం 77 మంది ప్రయాణికులు ఉన్నారని స్పష్టం చేసిన మంత్రి కురసాల కన్నబాబు... ఇంకా 16 మృతదేహాలను వెలికితీయాల్సి  ఉందని తెలిపారు. అయితే మృతదేహాల కోసం అధికారులు 5 రోజుల నుండి ముమ్మర  గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే 250 అడుగుల లోతు లో బోటు ఉన్నట్లు గుర్తించారని మిగిలిన మృతదేహాలు బోట్  చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా వేశారు మంత్రి . కాగా  గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల... బోటు ను బయటకు తీయడం కష్టతరంగా మారింది అని చెప్పారు. బోట్  ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడిన స్థానిక గిరిజనులను  మంత్రి అభినందించారు.అయితే  గోదావరి ప్రవాహం దృశ్య బోటు పాపికొండలు సందర్శనకు బయల్దేరడానికి అనుమతి లేదని... పర్యాటక మంత్రి ఒత్తిడి వల్ల బోట్ బయల్దేరిందని  విపక్ష నేతల ఆరోపించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: