మనుషుల్లో రోజురోజుకీ మానవత్వం మంట గలుస్తుంది. మనిషి చనిపోతున్న  కూడా కనీస కనికరం చూపించడం లేదు . ఇక్కడ అలాంటి ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తమ హాస్పిటల్లో చేరిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది . దీంతో ఆమె  మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు భర్త అంబులెన్స్ ని కోరిన హాస్పిటల్ సిబ్బంది ససేమిరా అన్నారు. కాళ్ళ వేళ్ళ పడ్డ కూడా కనికరించలేదు. దీంతో చేసేదేమీ లేక తన ముగ్గురు  పిల్లలను బస్సులో పంపించి రిక్షా పై తన  భార్య మృతదేహాన్ని వేసుకుని 45 కిలోమీటర్లు లాక్కెళ్లాడు ఆ  భర్త . ఈ హృదయ విదారక ఘటన అందరిని కలిచి వేస్తోంది.

 

 

 అలహాబాద్ -శంకర్ ఘడ్  రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కల్లు దాయకర్  అనే వ్యక్తి దాయ్ కారాణాలో  కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతనికి భార్య  సోనా దేవి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవలే ఆమె తలకి గాయం అయ్యి  మానిపోయినప్పటికీ...  కొన్నాళ్లకు జ్వరం వచ్చి గాయం మళ్లి  సమస్యగా మారింది. దీంతో ఆమెను   స్వరూపరాణి  నెహ్రు హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను అందించారు . అయితే ఐదు రోజుల పాటు అదే హాస్పిటల్లో చికిత్స పొందిన ఆమె  మృతి చెందింది. అయితే తన భార్య మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించమని భర్త  కల్లు దయాకర్ ఆసుపత్రి సిబ్బంది కి విజ్ఞప్తి చేశాడు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం అంబులెన్స్ సౌకర్యం కల్పించం  అంటూ  తెగేసి చెప్పేశారు. కాళ్లావేళ్లా పడినా కూడా కనికరించలేదు . ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లే  స్థోమత కూడా ఆయనకు లేదు. దీంతో చేసేదేమీ లేక తన ముగ్గురు పిల్లల్ని బస్సు లో పంపించి ట్రాలీ  రిక్షా పై  తన భార్య మృతదేహాన్ని వేసుకొని 45 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు ఆ భర్త . అయితే భర్త తన భార్య శవాన్ని రోడ్డుపై ఇలా లాక్కెళ్లడం   చూసిన వాళ్ల మనసును కలచివేసింది ఈ ఘటన. కాగా  దీనిపై ఆసుపత్రి సిబ్బందిని  ప్రశ్నిస్తే హాస్పిటల్ లో ఆ మహిళ అసలు చేరనే లేదని... చేరనప్పుడు అంబులెన్స్ సౌకర్యం ఎలా కల్పిస్తామని ఆశ్చర్యమైన సమాధానం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: