ఎన్నో ఎన్నెన్నో కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటిది మరో కొత్త రకమైన కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ కార్లు ఏంటి... ఎక్కడకు వచ్చాయి అని పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2020లో కొత్త కొత్త వాహనాలు తెరమీదకు వస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలోనే ఆటో ఎక్స్‌పో 2020లో ఫ్రెంచ్‌ కార్ల తయారీ దారు రెనాల్ట్‌  ప్రేమికుల కోసం ఓ అద్భుతమైన ఆకర్షణీయమైన కారును తీసుకొచ్చారు. ట్విజీ అనే పేరుతో ఈ మైక్రో ఎలక్ట్రిక్ వాహనం తీసుకువచ్చారు. ఈ వాలెంటైన్స్ డే సీజన్‌కు ఎంతో స్పెషల్‌..  అట్రాక్టీవ్ గా ఈ కారు నిలిచింది. 

 

అయితే యూరోపియన్ మార్కెట్లో ఈ ట్విజీకి మంచి ఆదరణ లభించింది. ప్రేమికులు ఈ కారును ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు అని కంపెనీ అధికారులు వెల్లడించారు. రెనాల్ట్‌  ట్విజీ  టాటా నానో కంటే చాలా చిన్నది. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇందులో ప్రయాణించగలరు. అలాంటి ఈ కారుకు 6.1 కిలోవాట్‌ బ్యాటరీని అమర్చారు. 

 

అయితే ఒకసారి ఈ కారుకు చార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే ఈ కారు కేజ్రీ లుక్స్ ప్రేమికులు మనసును దోచుకున్నాయి. అయితే ఈ కారును ఇప్పట్లో భారత్ లో విడుదల చేస్తున్నట్టు ఇంకా ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఒకవేళ వెల్లడించినప్పట్టికి ఈ కారును భారత్ లో కొనడం కష్టమే.. ఎందుకంటే ఈ కారులో ఆరు అడుగులు హైట్ ఉన్న.. కొంచం బరువు ఎక్కువ ఉన్న పట్టారు కాబట్టి. ప్రేమికులకు కూడా కేవలం సన్నగా ఉన్నవారికి మాత్రమే ఈ కారు నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: