బీఎండబ్ల్యూ...జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ. కార్ల రంగంలో త‌న ముద్ర‌ను నిలుపుకొంటున్న ఈ కంపెనీ బైకుల రంగంలోకి సైతం అడుగిడిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, దేశీయ మార్కెట్లోకి మరో బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. థర్డ్ జనరేషన్‌గా రూపొందించిన బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్‌ఆర్ సూపర్‌బైకు రూ.8.50 లక్షల నుంచి రూ.22.95 లక్షల మధ్యలో నిర్ణయించింది. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ మోటోరాడ్ హెడ్ ద్మిత్రిస్ రాప్టిస్ మాట్లాడుతూ..పాతదాంతో పోలిస్తే ఈ నూతన మోడల్ తక్కువ బరువు కలిగివున్నదని, అలాగే అత్యంత వేగం, సులువుగా కంట్రోల్ చేయడానికి వీలుగా పలు మార్పులు చేసినట్లు చెప్పారు.


భారత్‌లో ప్రీమియం బైకులకు పెరుగుతున్న ఆదరణతో ఈ ఏడాది చివరి నాటికి మూడోస్థానానికి ఎగబాకే అవకాశం ఉందని రాప్టిస్ అన్నారు. విక్రయాల పరంగా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉన్నదన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు, రాయితీలు ఇస్తేనే భారత్‌లో ఎలక్ట్రిక్ బైకులను ప్రవేశపెడుతామని రాప్టిన్ స్పష్టంచేశారు. 2017లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థ..గతేడాది 2,187 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఆసియా-పసిఫిక్, చైనా, రష్యా, ఆఫ్రికా తర్వాత ఐదో స్థానంలో నిలిచింది. 


2018లో సైతం దేశీయ మార్కెట్లోకి సంస్థ‌ రెండు మోడళ్లను పరిచయం చేసింది. రూ.11.95 లక్షల నుంచి రూ.14.40 లక్షల లోపు ఈ బైకులు లభిస్తున్నాయి. మూడు రకాల్లో లభించనున్న ఎఫ్750 జీఎస్ మోడల్ రూ.11.95 లక్షల నుంచి రూ.13.4 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. అలాగే మరో మోడల్ ఎఫ్850 జీఎస్ కూడా రూ.12.95 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.14.4 లక్షలకు విక్రయిస్తోం. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. ఈ రెండు మోడళ్లలో అత్యంత శక్తివంతమైన రెండు సిలిండర్లు, 853 సీసీ సామర్థ్యంతో రూపొందించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: