ఒకప్పటి లెజెండరీ బైక్ జావా మహేంద్రా అండ్ మహేంద్రా భాగస్వామ్యంతో రీ లాంచ్ అయ్యింది. అధునాతన సౌకర్యాలతో వస్తున్న ఈ బైకులు బుకింగ్స్ లో కూడా అదరగొట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 5000 లు కట్టి మరి బైక్ బుక్ చేసుకున్నారు. అయితే డెలివరీ లేటవుతున్న కారణంగా జావా బైక్స్ రీ సేల్ అవుతున్నాయి. జావా కి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బైకులను కొనడం వెంటనే ఓలెక్స్ ద్వారా అమ్మేస్తున్నారు.  


జావా బైకులు డెలివరీకి 8 నెలల టైం తీసుకుంటుండగా త్వరగా తమ చేతికి బండి రావాలనుకునే వారు ఆల్రెడీ కొన్న వాళ్ల దగ్గర కొనుక్కుంటున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ బైక్ కదా అని రేటు తగ్గించడం మాట అటుంచితే జావా 42 బైక్ ఆన్ రోడ్ ప్రైజ్ సుమారు 1.80 నుండి 1.90 లక్షల వరకు ఉండగా ఓలెక్స్ లో మాత్రం ఇవి 2.2 నుండి 2.4 లక్షల దాకా డిమాండ్ ఉంది. 


ఇలా చేస్తే కంపెనీకి ఎంత లాభం అన్నది పక్కన పెడితే మధ్యలో వాళ్లకు బాగా లాభాలు వస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ లో ఓలెక్స్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. కొత్తగా వచ్చిన జావా బైకుల హవా ఓలెక్స్ లో సందడి చేస్తున్నాయి. మరి డెలివరీ పిరియడ్ తగ్గించి కస్టమర్స్ కు మరింత ప్రియం అయ్యేలా చేస్తారేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: