ఇండియా మార్కెట్ లోకి రిలీజైన (మోరిస్ గ్యారేజ్) MG హెక్టార్ నెల రోజుల్లోనే 1508 యూనిట్లను అమ్మడం జరిగింది. 28000 బుకింగ్స్ జరుగగా రానున్న రోజుల్లో 3000 బుకింగ్స్ ప్రతి నెల అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి బుకింగ్స్ ఆపేయగా త్వరలోనే మళ్లీ రీ ఓపెన్ చేస్తారని తెలుస్తుంది.  


జూన్ 27న MG హెక్టార్ వెహికల్ లాంచ్ చేశారు. 12.18 నుండి 16.88 లక్షల వరకు వెహికల్ ప్రైజ్ ఉంది. ఈ వెహికల్ ఫోర్ వేరియెంట్స్ లో అందుబాటులోకి వస్తుంది. MG హెక్టార్ నుండి వచ్చిన మొదటి నాలుగు వెహికల్స్ లో రెండు డీజిల్ ఇంజిన్ తోనే వస్తుండగా మరో రెండు పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నాయి.    


భారతీయ మార్కెట్ లో రిలీజ్ అయిన MG మోటార్ వెహికల్స్ కు కష్టమర్స్ ఇచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉందని అంటున్నారు కంపెనీ నిర్వాహకులు. మరిన్ని మోడల్స్ తో MG వెహికల్స్ ను ఇండియాలో స్ట్రాంగ్ సేల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. MG హెక్టార్ వెహికల్ జూలైలో కూడా 21 వేల అడ్వాన్స్ బుకింగ్స్ తెచ్చుకుంది.     





మరింత సమాచారం తెలుసుకోండి: