అందంగా ఉండాలనే ఆతురతతో మహిళలు మార్కెట్లో వచ్చే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ కొంటుంటారు. అయితే ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటివారి కోస‌మే పెరుగు అద్భుతంగా ప‌నిచేస్తుంది. పెరుగు.. రుచి చూడ‌ని వారుండ‌రు. మన ఆహారంలో ఉపయోగించే పెరుగు చర్మకాంతికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగులో జింక్‌, క్యాల్షియం, బి-విటమిన్స్‌, లాక్టిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఇవి చర్మకాంతికి ఉపయోగపడటమే కాకుండా ముఖంపై ఉండే మొటిమల్ని రాకుండా చేస్తాయి. మ‌రి పెరుగును ఎలా వాడాలి..? అని అనుకోవ‌చ్చు. అలాంటి వారు లేట్ చేయకుండా కింద టిప్స్‌ను ఫాలో అయిపోండి.

 

పెరుగు, దోసకాయ తురుము, కలబంద, తేనె తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ముఖ చర్మం మండడం, కమిలిపోవటం వంటి వాటికి ఈ పెరుగు ఫేస్‌ప్యాక్‌తో ఉపశమనం పొందవచ్చు. పెరుగులో టమాటా పేస్ట్‌ను క‌ల‌పండి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి పావు గంట త‌ర్వాత గోరువెచ్చిన నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

 

అలాగే పెరుగు, తేనె, అవకాడో మిశ్రమం, ఓట్‌మీల్ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ముఖ చర్మం పొడిబారితే ఈ పెరుగు ఫేస్‌ప్యాక్‌ సహాయంతో మృదువుగా, కాంతివంతంగా తీర్చిదిద్దవచ్చు. పెరుగులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి పావు గంట త‌ర్వాత గోరువెచ్చిన నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా త‌రచూ చేయ‌డం చర్మంలో జిడ్డు తత్వం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: