వర్షాలు పడుతుంటే చాలు  జుట్టు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఎన్ని విధాలుగా రక్షణ చర్యలు చేపట్టినా సరే జుట్టు మాత్రం నరకం చూస్తుంది. ఇక ఇదిలా వర్షాకాలంలో జుట్టు సేఫ్ గా ఉండాలి అంటే కొన్ని మాస్క్ లు ఉన్నాయి.


అవి ఏంటీ అనేది చూద్దాం. అవకాడో- ఆలివ్‌ ఆయిల్‌ మాస్క్‌ చాలా మంచిది. అవకాడో –అర ముక్క, గుడ్డు- ఒకటి, ఆలివ్‌ ఆయిల్‌- ఒక టేబుల్‌స్పూన్‌, తేనె- ఒక టేబుల్‌ స్పూన్‌. వీటన్నింటినీ మిక్స్‌ చేసి మిశ్రమాన్ని తడిగా ఉన్న తలకు వేళ్ల అంచులతో పై నుంచి బాగా రాస్తే, తర్వాత జుట్టు ముడి వేసి పెట్టండి. ఇలా చేస్తే మెల్లగా మిశ్రమంలోని పదార్థాలు కుదుళ్లలోకి వెళ్లి పని చేయడం మొదలు పెట్టి, మన జుట్టుకి రక్షణ ఇస్తాయి.హెయిర్ డ్రైయర్  తో హెయిర్‌ ని పొడిగా చేసిన తర్వాత 30 నిమిషాలు అలాగే ఉంచుకుని చల్లటి నీళ్ళతో తల స్నానం చేసుకోవాలి. కొబ్బరినూనె-టీట్రీ ఆయిల్‌ మాస్క్‌ కూడా బాగా ఉపయోగపడుతుంది.



మృతకణాలు వదిలితే చుండ్రు బాధ ఉండదని నిపుణులు చెప్తున్నారు. కొబ్బరి నూనె యాంటి ఇన్‌ఫ్లమేటరీ సబ్‌ స్టెన్స్‌. టీ ట్రీ ఆయిల్‌ యాంటి ఫంగల్‌ ట్రీట్‌మెంటుకు ఎంత గానో ఉపయోగపడుతుందని నిపులు సూచిస్తున్నారు. ఏంటీ... కావలసినవి అంటే.... శుద్ధి చేయని కొబ్బరి నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, చక్కెర- నాలుగు టేబుల్‌ స్పూన్లు, పిప్పర మెంట్‌ ఆయిల్‌- ఐదు చుక్కలు, టీ ట్రీ ఆయిల్‌- రెండు చుక్కలు కావాలి .   ఈ పదార్థాలన్నింటిని కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి  మూడు నిమిషాల పాటు మసాజ్‌ చేసి కాసేపు అలాగే ఉంచి తర్వాత తల స్నానం చేస్తే చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి అని చెప్తున్నారు.  ఇలా జుట్టుకి మాస్క్ లు చాలా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: