మొటిమలు.. ఈ సమస్య చాలా మందిని పట్టి పీడిస్తుంది. ముఖానికే కాదు చాలా మందికి వీపున కూడా మొటిమలు వస్తుంటాయి. దీనికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమవుతుంటారు.అయితే ఈ సహజ చిట్కాలు పాటిస్తే చాలు మొటిమలు మటు మాయం అవుతాయి.మొటిమలను నివారించే ‘పెక్టిన్‌‌‌‌’ యాపిల్స్‌లో ఉంటుంది. అందుకే.. ప్రతి రోజూ ఓ యాపిల్ పండు తింటే పింపుల్స్ సమస్య రానేరాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజూ గ్లాసుడు టమాటా జ్యూస్ లేదా క్యారెట్ జ్యూస్ తాగితే స్కిన్ హెల్తీగా ఉంటుంది. గ్లో పెరుగుతుంది.ప్రతి రోజూ వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.ఎక్కువ నీరు తాగితే స్కిన్ ఫ్రెష్‌గా ఉంటుంది.తాజా ఆకు కూరలు, పండ్లు తినాలు. జంక్‌ ఫుడ్‌, మసాలా దట్టించిన ఆహారానికి దూరంగా ఉండాలి.చర్మ సంరక్షణకు పసుపు చక్కగా పని చేస్తుంది.ఆహారంలో పసుపును ఉపయోగిస్తే పింపుల్స్‌కు కారణమైన బ్యాక్టీరియాను సమర్థంగా ఎదుర్కొంటుంది.నిద్రలేమి వల్ల కూడా మొటిమల సమస్య తీవ్రంగా మారుతుందట. అందుకే ప్రతి రోజూ కంటి నిండా నిద్ర పొండి. కనీసం 8 గంటలు పడుకోండి.మొటిమలు ఉన్నాయి కదా అని చర్మాన్ని ఎక్కువ సార్లు కడిగినా ప్రమాదమే. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేస్తే చర్మంలోని ఆయిల్స్ తగ్గి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే రోజుకు రెండు సార్లు శుభ్రపరుచుకుంటే చాలు.



టమాటా రసం, నిమ్మకాయ రసం మిక్స్ చేసి మొటిమలకు పట్టించి కాసేపయ్యాక చల్లని నీటితో కడిగేస్తే మొటిమలతోపాటు మచ్చలు కూడా తగ్గుతాయి.బంగాళ దుంప జ్యూస్ తీసుకుని అందులో బియ్యం పిండి కలపండి. ఈ మిశ్రమాన్ని రెండు రోజులకు ఒక సారి ఉపయోగిస్తే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.కలబందను కట్ చేసి ఆ జెల్‌ని మొటిమలపై అప్లయ్ చేస్తే మొటిమలు తగ్గడంతోపాటు మచ్చలు కూడా పోతాయి. కలబందలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.స్నానం చేసే ముందు వీపుపై మొటిమలున్న ప్రాంతంలో తేనె రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి పేస్టులా తయారు చేసి అప్లయ్ చేస్తే మొటిమలు తగ్గుతాయి. మచ్చలు కూడా పోతయి. గ్రీన్ టీ తాగేటప్పుడు నీటిలో బ్యాగ్ కాసేపు ఉంచి ఆ తర్వాత పారేస్తాం. ఐతే.. ఇలా వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్‌ని కాస్త చల్లారాక వీపు మీదున్న మొటిమలపై పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది. మొటిమల వల్ల కొంతమందికి చర్మం వాపు కనిపిస్తుంది. దీనికి కూడా గ్రీన్ టీ బ్యాగ్ చక్కగా పని చేస్తుంది. రాత్రి నిద్ర పోయే ముందు మొటిమలపై వెల్లుల్లిని చిదిమి రాస్తే మంచి ఫలితం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: