అందంగా ఉండాలంటే కళ్ళు కూడా అందంగా ఉండాలి. కళ్ళకు అందం కావాలంటే కను రెప్పలు నల్లగా ఒత్తుగా ఇంకా చక్కగా ఉండాలి. కాబట్టి చక్కని కనురెప్పల కోసం చక్కటి టిప్స్ మీ కోసం.. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చక్కటి టిప్స్ ఏంటో తెలుసుకోండి...


ఆలీవ్ ఆయిల్ కనురెప్పలకి చాలా మంచిది. దీని వల్ల కేవలం చర్మం మెరుస్తూ ఉండడమే కాక జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ లో ఒక కాటన్ ని ముంచి మీ కనురెప్పల మీద అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశం హైడ్రేటెడ్ గా ఉంటుంది, హెయిర్ ఫాలికిల్స్ బలంగా తయారవుతాయి, మీ కనురెప్పలు పొడుగ్గా, ఒత్తుగా తయారవుతాయి.


విటమిన్ ఈ ఆయిల్ కూడా కను రెప్పలకి చాలా మంచిది. విటమిన్  క్యాప్సూల్ ఆయిల్ ని ఒక చిన్న బౌల్ లోకి తీసుకోండి. మీ కనురెప్పల్ని ఆ ఆయిల్ తో మృదువుగా మసాజ్ చేయండి. అలాగే, ఐలాషెస్ మీద కూడా కొంచెం అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. లేదా, ఈ ఆయిల్ తో ఒక స్పూలీ బ్రష్ ముంచి దాంతో మీ కనురెప్పలని పైకి దువ్వండి. ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రకి ముందు చేసి మరునాడు పొద్దున్న శుభ్రం చేసేసుకోండి.


కొబ్బరి నూనె కూడా అందమైన కను రెప్పలకి చాలా మంచిది.కాబట్టి, ఎలాంటి అసౌకర్యం లేకుండా డెలికేట్ గా ఉండే కంటి దగ్గర కూడా అప్లై చేయవచ్చు. ఇలా రోజు అప్లై చెయ్యటం వల్ల కనురెప్పలు నల్లగా ఒత్తుగా ఉంటాయి.


గ్రీన్ టీ కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయం చేస్తుంది.కాబట్టి రోజూ గ్రీన్ టీ తాగండి. లేదా, ఒక గ్రీన్ టీ బ్యాగ్ కనురెప్పల మీద ఉంచుకుంటే అలసిన కళ్ళకి విశ్రాంతి లభించడమే కాక, మీ కనురెప్పలు కూడా ఒత్తుగా పెరుగుతాయి. లేదంటే, గ్రీన్ టీ కాటన్ లో ముంచి కనురెప్పల మీద రోజూ అప్లై చేయండి.చాలా నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: