ఇక చర్మ సమస్యలు తరచుగా ఇబ్బందులు పెడుతుంటాయి. ముఖం పాడై పోవటం, మొటిమలు రావడం,పొడిబారిపోవడం లేదంటే ఎండలకి నల్లగా మాడిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇక చర్మ రక్షణ కోసం ఖచ్చితంగా యాంటి ఏజింగ్ సిరమ్ ఖచ్చితంగా వాడాలి. యాంటీ ఏజీయింగ్ సీరమ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవి స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి.యాంటీ ఏజీయింగ్ సీరమ్స్ వల్ల చర్మం సాగిపోకుండా ఉంటుంది, స్కిన్‌కి మంచి టెక్స్చర్ వస్తుంది.అది ఎలా తయారు చేసుకోవాలి. ఎలా వాడాలో తెలుసుకోండి.

యాంటి ఏజింగ్ సిరమ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు...


కలబంద జెల్ - మూడు టేబుల్ స్పూన్లు..

విటమిన్ ఈ టాబ్లెట్స్- రెండు..

గులాబీ వాటర్ - మూడు టేబుల్ స్పూన్లు..

అవకాడో ఆయిల్ - రెండు మూడు చుక్కలు..

మీకు నచ్చే ఎస్సెన్షియల్ ఆయిల్ - రెండు మూడు చుక్కలు...

గ్లిసరిన్ - ఒక టేబుల్ స్పూన్...


తయారు చేసే విధానం...

ఒక బౌల్‌లో తాజాగా తీసిన కలబంద జెల్‌ని వేయండి. అందులో విటమిన్ ఈ టాబ్లెట్ నుంచి తీసిన ఆయిల్‌ని కలపండి. ఇప్పుడు గులాబీ వాటర్, గ్లిసరిన్ కూడా జోడించి బాగా కలపండి. కావాలనుకుంటే బ్లెండ్ కూడా చేయండి. ఇప్పుడు అవకాడో ఆయిల్, ఎస్సెన్షియల్ ఆయిల్ జోడించి ఒక గ్లాస్ బాటిల్ లో నిల్వ చేసుకోండి.


ఇక దీన్ని ఎలా వాడాలంటే..తడిగా ఉన్న చర్మం మీద క్లీన్ ఫింగర్ టిప్స్‌తో సీరమ్‌ని అప్లై చేసి మసాజ్ చేయండి. ఇలా కాసేపు మసాజ్ చేయడం వల్ల సీరమ్ చర్మం లోపలికి బాగా చేరుతుంది. సీరమ్ పూర్తిగా చర్మంలోకి ఇంకి పోయిందనుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది.దీని వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది, ఎర్రదనం, దురద కంట్రోల్ అవుతాయి, స్కిన్ కి తగినంత తేమ అంది ముఖం మంచులో తడిసిన మల్లెపువ్వులా ఉంటుంది.ఇంకా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తగ్గుతాయి.ఇక ఇలా చెయ్యండి చర్మం రక్షణగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: