కాలం మారే కొద్ది అనేక రకాల అనారోగ్య సమస్యలతోపాటు చర్మ సమస్యలు కూడా మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటాయి. ముఖ్యంగా సీజన్‏ను బట్టి రక రకాల చర్మ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక వర్షాకాలంలో అయితే చెప్పనవసరం లేదు.చర్మం చాలా పొడిగా ఉండి దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.ఇక ఈ నేపథ్యంలో వర్షాకాలంలో చర్మాన్ని సంరక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి. ఖచ్చితంగా పాటించంచండి.రోజుకి కనీసం మూడు సార్లు అయిన ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని రోజ్ వాటర్, కలబంద లేదా యాపిల్ సిడార్ వెనిగర్‏ను చర్మానికి అప్లై చేస్తే ఎంతో మృదువుగా ఉంటుంది.ఇక వర్షాకాలంలో చర్మం టోన్ బాగుండటానికి చర్మంపై టోనింగ్ చెయ్యాలి. ఇక టోనింగ్ చేయడానికి పాలు, నిమ్మకాయ రసం, కీరదోస రసం లేదా గ్రీన్ టీ లాంటివి రాస్తూ ఉండాలి. ఇలా చెయ్యటం వలన మృత కణాల బెడద కూడా తగ్గుతుంది.ఇక అలాగే చర్మం నుంచి టాక్సిన్లను బయటకు పంపడానికి ఎక్కువగా మంచినీటిని తాగుతూ ఉండాలి.

మంచి నీళ్లు తాగడం వలన మొటిమలు, మచ్చలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అలాగే వర్షాకాలంలో బయట నుంచి వచ్చిన వెంటనే మేకప్‏ను తొలగించి ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక వారానికి ఒకసారైనా సరే ఒంటికి కొబ్బరి నూనె రాసి సెనగ పిండితో నలుగు పెట్టుకొని శుభ్రంగా స్నానం చేయాలి. ఇక అలాగే రోజూ అరచెక్క నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.ఇక వర్షాకాలంలో మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు.ఇక చర్మం పొడిబారకుండా మృదువుగా ఉండాలంటే.. రెగ్యులర్‏గా మాయిశ్చరైజర్ ను అప్లై చెయ్యాలి.ఇక అలాగే వర్షాకాలంలో షూస్, సాక్స్ అస్సలు ధరించకూడదు. అవి ధరించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అవి ధరించడం వలన ఇన్ఫెక్షన్ల భారిన పడే ప్రమాదముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: