బలమైన, వతైన శిరోజాల కావాలని చాలా మంది కోరుకుంటారు. మనం తీసుకునే  ఆహారం మీద కాస్త శ్రద్ధ పెడితే,అందమైన శిరోజాలు మన సొంతం చేసుకోవచ్చు.......
మన జోరు వారి  జీవన శైలిలో  కొన్ని మార్పులు చేస్తే ఎన్నో సత్ ఫలితాలుంటాయి.
మనం వాడే నీరు దగ్గర్నుంచి   గాలి వరకు అన్ని రోజు రోజుకి కలుషితం అవుతున్నాయి. షాంపూలో, నూనెలో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్లా వెంట్రుకలు బలహీనమైపోతున్నాయి.
ఎప్పుడు బయటికి వెళ్లిన దుమ్ము, దూళి నుంచి జుట్టును కాపాడుకోవడం/కవర్ చేయడం మన మొదటి పని/బాధ్యత.
ఎంత బయటి నుంచి కాపాడుకున్న,మనం తీసుకునే ఆహారం  కూడా కొంత వరకు జుట్టును బలోపేతం చేస్తుంది.  జుట్టుని మూలాల నుండి రక్షించుకోడానికి ఇదిగోండి ఈ చిట్కాను పాటించండి.....

చిట్కా: ఒక గ్లాస్ మజ్జిగలో పిడికెడు కరివేపాకు ఆకులు లేదా కరివేపాకు ఆకుల పేస్ట్  వెస్కొని  క్రమంగా దాని తాగండి,
దీనిని రెగ్యులర్ గా చేయడం వల్ల ఫలితాలు మేరె చూస్తారు. కరివేపాకు లో బీటా కెరోటిన్ మరియు అమైనో ఆమ్లాలు ఉన్నాయి, ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి, నిద్రాణమైన ఫోలికల్స్‌ను పునరుత్పత్తి చేస్తాయి మరియు కొత్త జుట్టును తిరిగి పెంచుతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును కూడా  మెరుగు  చేస్తుంది  ఇంకా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.

మజ్జిగ జుట్టు కుదుళ్లు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది,మజ్జిగలో అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి, ఇది జుట్టును లోతుగా పోషిస్తాయి మరియు కొత్త జుట్టు పెరుగుదలను పెంచుతాయి. అనవసరమైన కొవ్వుని కూడా కరిగిస్తుంది. మజ్జిగ కడుపుకి ఎంత చల్లనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఏది అయిన ఒకటి రెండు రోజులోనే  మనకి ఫలితాలు రావు, క్రమంగా చేయడం వల్ల మార్పులు కనిపిస్తాయి.
మరి ప్రయత్నించి చుడండి  ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం.... సుమ!

మరింత సమాచారం తెలుసుకోండి: