వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ-పురుషులు అన్న బేధాలు లేకుండా చాలా మందికి చుండ్రు వస్తుంది,
ఇది ఓ పెద్ద సమస్యగా మారుతుంది. డ్రై స్కిన్, సరిగ్గా తలస్నానం లేక పోవడం వంటివి
చుండ్రు రావడానికి గల కొన్ని కారణాలు. జుట్టు ఎంత ఒత్తుగా, పొడుగ్గా ఉన్న చుండ్రు వల్ల దాని అందం పోవడమే కాకుండా వెంట్రుకలు బలహీనం కూడా అవుతాయి.చుండ్రును తాగించడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ను ఒకసారి ట్రై చేయండి.

హెయిర్ ప్యాక్: కొన్ని వేపాకు ఆకులు తీసుకోండి,(ఆకులని మంచిగా దుమ్ము ధూళి లేకుండా కడుగుకోవాలి)
ఈ ఆకులలో కొంచెం పుల్లటి పెరుగు, కొద్దిగా తేనే వేసి పేస్ట్ చేసుకోవాలి.(గమనిక: హెయిర్ ప్యాక్ వేసుకునే కన్న ముందు తలస్నానం చేయాలి, వెంట్రుకలకు నూనె ఉండకూడదు.)
ఇప్పుడు ఈ ప్యాక్ ని స్కాల్ప్ కు  అలాగే వెంట్రుకలంతటికి సరిగ్గ అంటేటుగా పెట్టుకోవాలి. వెంట్రుకలని ఒక ముడి లేదా కొప్పు లాగా వేసుకొని ఒక హెయిర్ క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ ఎండిపోయే వరకు ఆగాలి. ప్యాక్ ఆరిన తర్వాత షాంపూ పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు తరచుగా పెట్టుకుంటుంటే చుండ్రు ఈటె మాయమైపోవడం ఖాయం.( మీ జుట్టు యొక్క పొడవు, వత్తుని బట్టి ప్యాక్ రెడీ చేసుకోగలరు)

ఒకవేళ మీకు రెగ్యులర్ గా వేపాకులు దొరకడం కష్టం అంటే కనుక మీరు ఆకులని స్టోర్ చేసుకొని కావలసినపుడు వాడుకోవచ్చు.
వేపాకులను తీసుకొని మంచిగా కడుగుకొని వాటిని ఎండబెట్టుకోవాలి, ఎండిపోయిన ఆకులని పొడి చేసి తీసి పెట్టుకోవాలి.హెయిర్  పాక్ వేసుకునేటపుడు ఆ పొడిలో పుల్లటి పెరుగు,తేనె వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.

ఈ ప్యాక్ వల్ల చుండ్రు పోవడమే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించి  జుట్టును బలంగా చేస్తుంది. తెల్ల వెంట్రుకలు తొందరగా రానివ్వకుండా సహాయపడుతుంది. ఈ ప్యాక్ వల్ల హెయిర్ సాఫ్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: