చలి కలం లో ఎంత ట్రై చేసిన కొన్నిసార్లు స్కిన్ తేమని కోల్పోతుంది. తరచుగా మోయిస్తూరిజర్ ని పెడుతూ ఉండాల్సి ఉంటుంది. స్కిన్ మొయిస్టర్ కోల్పోవడం కారణం గా స్కిన్ డ్రై అయిపోయి, నాచురల్  గ్లో తగ్గిపోతోంది. ఈ సమస్య నుండి చర్మం ను బయట పడేయాలి అంటే కనుక మనం కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది.

మరి దీని కోసం ఒక హోమ్ మేడ్ ప్యాక్ ట్రై చేద్దామా?  మన అందరి ఇంట్లో కచ్చితంగా ఉండే టమాటో తో ఒక ప్యాక్ చేద్దాం. ఈ టమాటో హోం మేడ్ ప్యాక్  చర్మం లో మొయిస్టర్ ని లాక్ చేయడమే కాకుండా,కాంతివంతమైన చర్మం ని మనకి అందిస్తుంది. మరి టమాటో ఫేస్ ప్యాక్  వాడి మీరే ఫలితాలను గమనించండి.


ఫేస్ ప్యాక్:పూర్తిగా పండిపోయిన టమాటలను తీసుకొని, దాన్ని గుజ్జు తీయండి. ఇప్పుడు తీసిన టొమాటో గుజ్జు లో 2 చుక్కల ఆలివ్ ఆయిల్ ను వేసి పక్కకి పెట్టాలి. ఇప్పుడు ముఖాన్ని గోరు వెచ్చని నీళ్లు కడుకొన్ని తడి ఆరిన తర్వాత, పొడిగా ఉన్న చర్మం మీద ఈ ప్యాక్ ను వేయాలి.  15 - 20  నిమిషాల పాటు ప్యాక్ ఆరనివ్వాలి. ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత గోరు వేచిన నీళ్లతో ముఖం ని లైట్ ఫింగర్స్ తో మసాజ్ చేసుకుంటూ ఆ ప్యాక్ ని కడిగేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మరియు తేమగా ఉంటుంది. ఇలా ఎవరని ఒకసారి చేస్తుంటే స్కిన్ లో మొయిస్టర్ లాక్ అవుతుంది ఇంకా డ్రై స్కిన్ లాంటిది కూడా తొలగిపోతుంది.

డ్రై స్కిన్ ఉన్నవారికి అయితే ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఒకసారి వాడి ఫలితాలను ఆశించకూడదు. ఏదైనా కొన్ని రోజులు క్రమం  చెస్తుంటేనే మార్పు అనేది వస్తుంది.


(గమనిక: కొందరికి చర్మం మీద కూరగాయలు, పండ్లు వంటివి పడవు, అలంటి స్పెషల్ స్కిన్  కండీషన్స్  ఉన్నవారు డాక్టర్ సుగ్గెస్తిఒన్ తీసుకోవడం మంచిది)


మరింత సమాచారం తెలుసుకోండి: