అందంగా కనిపించడంలో మన ముఖంతో పాటుగా శరీర ఆకృతి కూడా చాలా ముఖ్యం. సన్నగా నాజూగ్గా ఉంటేనే మనం అన్ని రకాల స్టైలిష్ దుస్తులను వేసుకోగలం. లావుగా ఉంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా పెద్దగా బావుండవు. సన్నగా ఉన్నవారు ట్రెడిషన్, మోడ్రన్ ఇలా ఏ రకమైన దుస్తులు వేసుకున్నా ఆ బట్టలకే అందం వచ్చేలా ఉంటుంది. అలాగే సన్నగా ఉండటం అందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. పరుగులు తీసి పని చేయాలన్నా, హుషారుగా ఉండాలన్నా సన్నగా ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. కాబట్టి సన్నగా నాజూగ్గా ఉంటే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే మనం ఫిట్నెస్ గా ఉండాలి అంటే మన ఆహారపు అలవాట్లను జీవన శైలిని కాస్త మార్చుకోక తప్పదు.

ఒకవేళ అలా చేయలేదంటే మనము ఫిట్ గా ఉండలేము. కూర్చున్న వ్యక్తి  సౌకర్యవంతంగా లేచి నిల్చో లేకపోయినా, హాయిగా ఫ్రీగా ఆయాసం రాకుండా కాసేపు అలా నడవలేకపోయినా, మీరు డేంజర్ జోన్ కి వెళుతున్నట్టే. ఎప్పటికప్పుడు పెద్దగా ప్రమాదం లేకపోయినా మును ముందు ఆ పెరిగిన బరువు మనకు హాని చేస్తుంది. అంతేకాదు మనల్ని నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడేలా చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ వెయిట్ ని చెక్ చేసుకుంటూ శరీర ఆకృతిపై దృష్టి పెట్టకపోతే అందంగా కనిపించాలి అనే మీ ఆశకు ఈ అధిక బరువు అడ్డు అవుతుంది. అందుకే బరువు మరి పెరిగిపోతున్నారు అనిపిస్తే తప్పకుండా వైద్యున్ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకుని వాటిని తూచ తప్పకుండా పాటించండి.

ముఖ్యంగా తొడ, నడుమూ,కాలూ, పొట్ట ఇలా కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లాగి చూడండి రెండు అంగుళాల కన్న ఎక్కువగా చర్మం చేతికి అందకూడదు. అంతకంటే ఎక్కువగా చేతికి అందుతుంది అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: