అందరూ అందంగా ఉండాలని అనుకుంటారు. చాలా మంది తమ చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల కాస్ట్లీ సోపులు, క్రీములు ఫేస్ వాసులు అంటూ వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో ఎంతో కొంత రసాయనాలు ఉండటం వలన చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు కొందరు నిపుణులు. సహజ సిద్ధమైన పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా పెసలు అయితే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు. చర్మానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు.

చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడం లోనూ పెసరు చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొద్దిగా పెసరపప్పు తీసుకుని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని నిలువ చేసుకోవాలి. దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఆ పెసరపిండిని వినియోగించుకోవచ్చు.

* రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను ఇరవై నిమిషాలకు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి... ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చక్కటి ఫలితాలను పొందగలరు.

* మూడు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూను బియ్యప్పిండి, కొద్దిగా పసుపు వేసి దానికి రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలోని మురికి, బ్యాక్టీరియా పోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: