సాధారణంగా యవ్వనంలో ఉన్న మహిళల నుండి ఒక వయసు వరకు ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందంగా కనిపించడానికి నేడు మార్కెట్ లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వేల కొద్ది ప్రోడక్ట్స్ రకరకాల కాంబినేషన్ లో మనకు దొరుకుతున్నాయి. అయితే చాలా మంది మాత్రం ఎక్కువగా ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాల తోనే తమ అందాన్ని రక్షించుకోవడానికి అలాగే పెంచుకోవడానికి వినియోగిస్తున్నారు. ఎందుకంటే కృత్రిమంగా తయారు చేయబడే ఫేసు క్రీములు మరియు లోషన్లు ఉత్పత్తుల కన్నా సహజమైన పదార్దాలే మన అందానికే కాకుండా ఆరోగ్యానికి సురక్షితమని నమ్ముతారు. అయితే ఎంత సహజ సిద్ధమైన పదార్దాలు అయినా కొన్నిటిని నేరుగా అలా ముఖానికి  రాయకూడదని హెచ్చరిస్తున్నారు ప్రముఖ నిపుణులు.  

అవి ఏంటో..??ఎందుకు..?? ఇపుడు తెలుసుకుందాం.

* నిమ్మ  చర్మ సౌందర్యానికి ఎంతో మేలును చేస్తుంది. కానీ నిమ్మకాయ రసాన్ని నేరుగా ముఖానికి పూయకూడదు. ఇందులో యాసిడ్ గుణాలు అధికంగా ఉంటాయి. దాని వల్ల దద్దుర్లు, మంట వంటివి కలిగి చర్మం దెబ్బ తింటుందని మృదుత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు.

* పచ్చి గుడ్డు లోని సొనను కూడా ముఖానికి నేరుగా పూయకూడదట. ఇందులో ఉండే సాల్మొనెల్లా అనేటటువంటి బ్యాక్టీరియా చర్మ పరిరక్షణకు మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు.

* కొబ్బరి నూనె కూడా చాలా మంది నేరుగా ముఖానికి రాస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు స్నానానికి ముందు శరీరం మొత్తం రాయడం చాలా మందికి అలవాటు. అయితే కొబ్బరి నూనెను డైరెక్ట్ గా వాడకూడదు అని కొందరి నిపుణుల అభిప్రాయం.  దాల్చిన చెక్క, ఆల్కహాల్, వంట సోడా వంటి పదార్దాలను కూడా చర్మానికి నేరుగా రాయటం మంచిది కాదని చెబుతున్నారు.

మీరు ముఖం అందం కోసం సరైన పద్దతిని ఎంచుకుని వాడడం మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: