ఒక‌ప్పుడు ఆమెను అంద‌రూ ఎంత స‌న్న‌గా ఉంద‌ని.. వేగంగా గాలి వీస్తే గాల్లోనే ఎగిరి పోతుంద‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా ఆమెను హేళ‌న చేసారు. కానీ ఆమె అవేమి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుపోయింది. స్కూల్‌లో త‌న తోటి విద్యార్థులు సైతం ప‌దే ప‌దే త‌న‌పై వేసే సెటైర్లు, జోకుల‌ను భ‌రించి.. సిగ్గుతో త‌ల‌దించుకుని ఒంట‌రిగా ఉండేందుకు ఇష్ట‌ప‌డింది ఆ అమ్మాయి హ‌ర్నాజ్ కౌర్ సంధు.

త‌న‌కు కుటుంబం మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో మోడ‌లింగ్ లో రాణించి.. సినిమాల‌లో న‌టిస్తూ ఏకంగా మిస్ యూనివ‌ర్స్ కిరీటాన‌ని ద‌క్కించుకునే స్థాయికి ఎదిగింది ఆమె. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశానికి రెండు సార్లు మాత్ర‌మే మిస్ యూనివ‌ర్స్ కిరీటం వ‌చ్చింది. గ‌తంలో మిస్ యూనివ‌ర్స్ పోటీల‌కు భార‌త్ నుంచి సుస్మితా సేన్‌, లారాద‌త్తా, సెలీనా జైట్లీ, నేహాదుపియా పోటీప‌డ్డారు. అయితే 1994లో సుస్మితాసేన్‌, 2000 సంవ‌త్స‌రంలో లారా ద‌త్తా మాత్ర‌మే మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం దాదాపు 80 పోటీదారుల‌తో పోటీప‌డి కిరీటాన్ని హ‌ర్నాజ్ కౌర్ సంధు ద‌క్కించుకున్న‌ది.

చండీఘ‌ర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవ‌త్స‌రంలో జ‌న్మించింది హ‌ర్నాజ్ కౌర్ సంధు . శివాలిక్ ప‌బ్లిక్ స్కూల్ పాఠ‌శాల‌లో విద్య‌ను పూర్తి చేసింది. ఆ త‌రువాత ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో డిగ్రీ చ‌దివింది. ప్ర‌స్తుతం ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేస్తున్న‌ది. హ‌ర్నాజ్ చిన్న‌ప్ప‌టి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక‌.. ఫిట్‌నెస్ ల‌వ‌ర్ కూడా. గుర్ర‌పు స్వారీ, ఈత ఢ్యాన్స్‌, యాక్టింగ్‌, ట్రావెలింగ్ వంటి వాటిని అమితంగా ఇష్ట‌ప‌డే వారు సింధు.

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల‌లో న‌టించాల‌నే కోరిక ఉండేద‌ట‌. ఆమె 17 ఏండ్ల‌కే మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టి.. క‌ళాశాల‌లో తొలి స్టేజ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌న మోడ‌లింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఒక ప‌క్క మోడ‌లింగ్ చేస్తూనే అనేక ఫ్యాష‌న్ షోల‌లో పాల్గొనేది కౌర్. ఈ త‌రుణంలోనే అందాల పోటీల‌లో పాల్గొని 2017లో మిస్ చంఢిఘ‌ర్ కిరీటాన్ని ద‌క్కించుకున్న‌ది. 2019లో మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ ప‌డి టాప్‌-12 జాబితాలో నిలిచింది. ఆ త‌రువాత మిస్ దివా యూనివ‌ర్స్ ఇండియా -2021 కిరీటాన్ని కైవ‌సం చేసుకుంది

చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్‌ ప్రదర్శనతో తన మోడలింగ్‌ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్‌ చేస్తూనే అనేక ఫ్యాషన్‌ షోల్లో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్‌ చంఢీఘర్‌’ కిరీటాన్ని గెలుచుకుంది. 2019లో ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ కోసం పోటీ పడి టాప్‌–12 జాబితాలో నిలిచింది. ఆ తరువాత ‘మిస్‌ దివా యూనివర్స్‌ ఇండియా–2021’ కిరీటాన్ని సొంతం చేసుకుంది హ‌ర్నాజ్ కౌర్ సంధు. తాను మిస్ కిరీటం కోస‌మే పుట్టిన‌ట్టు ఉంది. తాను పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఎవ‌రూ సాధించ‌లేని ఘ‌న‌త ఆమె సాధించ‌డం గ‌మ‌నార్హం. హ‌ర్నాజ్ కౌర్ సింధు 2000 సంవ‌త్స‌రంలో పుడితే 2000 సంవ‌త్స‌రంలో భార‌త్‌కు లారాద‌త్తా మిస్ యూనివ‌ర్స్ కిరీటం ద‌క్కించుకుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ కు ఒక్క టైటిల్ కూడా రాలేదు. 2000 సంవ‌త్స‌రంలో పుట్టిన కౌర్ ఆ టైటిల్ ప్ర‌స్తుతం ద‌క్కించుకోవ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం.




మరింత సమాచారం తెలుసుకోండి: