వాతావరణంలో మార్పులు.. చుట్టూ కాలుష్యం.. తీసుకునే ఆహారంలో పోషకాల లోపం.. జుట్టు సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అన్నీ కూడా తలపై చుండ్రు రావడానికి కారణమవుతాయి. చుండ్రు రావడం వల్ల ఇతరులకు చికాకులు కలిగించడమే కాకుండా..చుండ్రు వచ్చినప్పుడు తల అంతా ఒకటే దురద, చికాకు.. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి చుండ్రును దూరం చేసుకోవాలంటే ఈ చిన్న రెమిడీస్ ఒకసారి ట్రై చేసి చూడండి.. ఇక ఆ రెమెడీస్ ఇప్పుడు మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


1.వేప ఆకులు:
వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎలాంటి రోగాలు అయినా సరే ఇట్టే నయమవుతాయని అందరికీ తెలిసిన విషయమే.. వేపాకులను వేడినీటిలో మరిగించి.. ఆ తర్వాత తలకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు వేప ఆకుల రసంతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.


2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె స్కాల్ఫ్ ను తడిగా చేసి చుండ్రు రానివ్వకుండా అడ్డుకుంటుంది. అందుకే ఈ కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి ఇలా చేయడం వల్ల స్కాల్ఫ్  మీద వచ్చే చుండ్రు, దురద దూరమవుతుంది.

3. ఆలివ్ ఆయిల్:
స్కాల్ఫ్ ను ఎప్పుడూ తడిగా ఉండేలా చేస్తుంది. కాబట్టి మీరు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే తల పై వచ్చే చుండ్రు దూరమవుతుంది. ఇందుకోసం ఆలివ్ ఆయిల్ ను కొద్దిగా గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేసిన తర్వాత వేడినీటిలో అద్దిన టవల్ తో జుట్టు మొత్తం కప్పివేయాలి. 45 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలాంటి పద్ధతులు వాడితే తప్పకుండా చుండ్రు తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: