అమ్మ అనిపించుకోవడం ఆడవారికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు.. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు ప్రతి క్షణం కూడా తల్లికి ఒక మధురానుభూతిని పెంచుతుంది.. అయితే ఈ సమయంలోనే శరీరంలో కూడా ఎన్నో మార్పులు సంభవిస్తాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే ముఖంలో కూడా పలు రకాల మార్పులు వస్తాయి.. ఇక ఈ తొమ్మిది నెలల అద్భుతమైన ప్రయాణం లో ఆడవారు తమ చర్మానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..

సహజంగా ఆడవారు స్కిన్ కేర్ విషయంలో చాలా సీరియస్ గా  జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.. అంతే కాదు చర్మ సౌందర్యం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ఇక పోతే కాబోయే అమ్మ తన చర్మ సౌందర్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ తొమ్మిది నెలల అందమైన ప్రయాణంలో శరీరంలో ఎన్నో మార్పులు చేసుకోవడం వల్ల హార్మోనల్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల చర్మం పొడిబారిపోవడం డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువే..


ఇకపోతే చాలామంది గర్భం దాల్చిన సమయంలో ఈ సమస్యలను తొలగించుకోవడానికి హానికర పదార్థాలను ఉపయోగించి ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఇందుకోసం ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం మెరవాలంటే అజీలైక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో స్కిన్ ను ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిని ఉపయోగించడం వల్ల యాక్నే , హైపర్ పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోతాయి. చర్మం ఒకవేళ పొడిబారిపోయినట్లు, బిగుతుగా కనిపిస్తూ ఉంటే మాయిశ్చరైజ్  చేయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అందడంతో పాటు చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి చర్మంపై ఎంత జాగ్రత్త వహిస్తుందో  డెలివరీ తర్వాత ముఖం అంతే అందంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: