ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరిలో చూసినా జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి.. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం, చుండ్రు, జుట్టు పొడిగా మారి పోవడం, చిట్లి పోవడం, రఫ్ గా మారడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రఫ్ గా ఉందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా జుట్టు మాత్రం సుతి మెత్తగా లేదని ఎంతోమంది అమ్మాయిలు వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. రఫ్ గా మారిన జుట్టును మెత్తగా మార్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


జుట్టుకి మాయిశ్చరైజ్ చేయడం:
జుట్టుకు తేమ అనేది చాలా అవసరం. సీజన్ ని బట్టి జుట్టు సహజ స్థితిలో కూడా మారుతూ ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా మీ జుట్టును మీరు  మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా జుట్టును చలికాలంలో జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ఎయిర్ హీటర్ లాంటివి ఉపయోగించకుండా ఉండాలి.. హెయిర్ డ్రైయర్లు , హీటర్ లు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారిపోవడం తోపాటు గరుకుగా తయారవుతుంది.


జుట్టుకు నూనె ఉపయోగించడం:
వారానికి రెండు సార్లు తలకి కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల జుట్టుకు సహజంగా తేమ అంది సుతిమెత్తగా తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వారానికి రెండు సార్లు తలకు కొబ్బరి నూనె పట్టించి మెత్తగా మసాజ్ చేసి.. మరుసటి రోజు ఘాడత తక్కువ కలిగిన షాంపుతో తలస్నానం చేయాలి.

మగ్గిన అరటి పండు , ఆలివ్ ఆయిల్:
జుట్టుకు సరిపడా మగ్గిన అరటిపండు ను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్ల నుంచి కొనల వరకు అప్లై చేయాలి.. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే జుట్టు మెత్తగా మారడమే కాకుండా స్ట్రైట్ గా కూడా తయారవుతుంది.

వీటితో పాటు షియ వెన్న, కలబంద, లావెండర్ నూనె వంటివి ఉపయోగించి కూడా రఫ్ గా ఉన్న జుట్టును సుతిమెత్తగా మార్చుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: