చాలా మంది మగవాళ్ళు మొటిమలు ఇంకా మచ్చలు సమస్యతో విపరీతంగా బాధ పడుతూ వుంటారు. ఇక మొటిమలు ఇంకా మచ్చలు ఉన్నవారికి వేప ఫేస్ ప్యాక్ అయితే చాలా మంచిది. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లు ఇంకా అలాగే మొటిమలను చాలా ఈజీగా నయం చేస్తాయి. రోజ్ వాటర్‌లో ఒక టీస్పూన్ వేప పౌడర్ వేసి బాగా పేస్ట్ లా చేయాలి. ఇక తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు బాగా నానబెట్టి ఇక ఆ తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి 3 సార్లు రాస్తే మగవారి ముఖంపై ఉండే మొటిమలు ఇంకా మచ్చలు చాలా ఈజీగా మాయమవుతాయి.పుదీనా ఫేస్ ప్యాక్ కూడా మగవారి అందానికి చాలా మంచిది.ఎక్కువ మొటిమలు ఇంకా అలాగే డల్ స్కిన్ ఉన్నవారికి ఈ ప్యాక్ ఖచ్చితంగా సరిపోతుంది. ముఖ్యంగా పురుషులకు ఇది మంచి ఫేస్ ప్యాక్ అనే చెప్పాలి. మీరు తులసి ఇంకా అలాగే పుదీనా పొడిని ఉపయోగించవచ్చు. లేదా తులసి ఆకులు ఇంకా పుదీనా ఆకులను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని కొద్దిగా నీళ్లతో పేస్ట్ లాగా చేసి, తరువాత మీ ముఖానికి అప్లై చేసి,ఒక పది నిమిషాలు పాటు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. ఇక ఇలా వారానికి 3 సార్లు చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది.

ఇక మీ చర్మంపై వుండే నల్లటి వలయాలను చాలా ఈజీగా తొలగించడానికి ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ ఇంకా అలాగే ఒక టీస్పూన్ తేనె తీసుకుని వాటిని కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి ఒక పదిహేను నిమిషాలు పాటు నానబెట్టి ఆ తర్వాత కడిగేయాలి. ఇక ఇలా రోజూ కనుక చేస్తే చర్మం చాలా తెల్లగా మారి ముఖం కూడా చాలా కాంతివంతంగా ఇంకా ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది.ఇక స్కిన్ టోన్ ను మెరుగుపరిచే శక్తి శనగ పిండికి ఉంది. అలాగే చర్మానికి ఇది కాంతిని ఇస్తుంది. శనగపిండిని స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా తమ చర్మపు రంగును బాగా పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.చిటికెడు శనగపిండి, 3 చిటికెల పసుపు పొడి ఇంకా అలాగే కొద్దిగా పెరుగు కలిపి ఆ పేస్ట్‌ ని మీ ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: