పసుపు ఇంకా వేప ఆకులని కనుక కలిపి వాడితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు కూడా మంచి ఆయుర్వేద గుణాలతో నిండి ఉంటాయి. వేప రసంలో పసుపు కలిపి తాగితే శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయి.వేప, పసుపులో యాంటీ ఆక్సిడెంట్ ఇంకా అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాటి నుంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండింటినీ కనుక కలిపి వాడితే ఎన్నో రకాల సమస్యలను అధిగమించవచ్చు. పసుపులో కాల్షియం, ఐరన్, సోడియం, ప్రొటీన్, విటమిన్ ఈ, విటమిన్ సి ఇంకా అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా అలాగే యాంటీ డయాబెటిస్ వంటి గుణాలు ఉంటాయి. వేప ఇంకా పసుపు కలిపి తీసుకుంటే శరీరాన్ని వైరల్ ఫ్లూ బారి నుంచి ఈజీగా కాపాడవచ్చు. ఈ రెండిటిని కలిపి ఉపయోగించడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలను ఈజీగా తొలగించవచ్చు.


వేప, పసుపు కలిపి వాడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వేప, పసుపును ఉపయోగించవచ్చు. ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఇంకా అలాగే మొటిమలను తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేప ఆకులను నీళ్లలో వేసి స్నానం చేస్తే చర్మానికి సంబంధించిన అలర్జీలు చాలా ఈజీగా తగ్గిపోతాయి.ఇక వేప ఆకుల పేస్ట్ తయారు చేసి అందులో కొంచెం పసుపు కలిపి చిన్న చిన్న గాయాలపై రోజుకు రెండు లేదా మూడుసార్లు కనుక రుద్దితే గాయం పెద్దది అవకుండా సెప్టిక్ అవకుండా వెంటనే నయం అవుతుంది. వేప ఆకులు వేసిన నీటిని ఆకు పచ్చగా మారే దాకా బాగా ఉడకబెట్టండి. ఇక ఆకు పచ్చగా మారిన నీరు చల్లబడే వరకు ఉండి ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి. ఇక షాంపుతో కడిగిన జుట్టును మళ్లీ చల్లబరిచిన వేపాకు నీటితో జుట్టుని కడిగితే అప్పుడు జుట్టులో ఉండే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: