ఉసిరి కాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. అంతే కాకుండా మన శరీరానికి అవసరమైన ఐరన్, క్యాల్షియం ఇంకా పీచు వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉసిరిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అతిసారం ఇంకా అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇది శరీరంలో హానికరమైన ట్యాక్సిన్లు ఇంకా విషతుల్య పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల అల్సర్లు ఇంకా కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఇక ప్రస్తుతమున్న యాంత్రిక జీవనానికి తోడు అనారోగ్యకరమైన జీవనశైలితో చాలామంది కూడా ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారికి గూస్‌బెర్రీస్‌ అనేది చాలా మంచి ఆహారం. ఇందులో కొవ్వును కరిగించే లక్షణాలు ఎంతో పుష్కలంగా ఉంటాయి.కాబట్టి ప్రతిరోజూ కూడా ఉసిరి కాయ రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్ట ఎక్కువగా వస్తే ఉసిరి కాయ జ్యూస్ తగ్గించి వారిని బాగా ఫిట్ గా ఉంచుతుంది.అలాగే డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా ఇంది మంచి హెల్దీ డ్రింక్.



మధుమేహ బాధితులు ప్రతి రోజూ కూడా వేడి నీటిలో కాసింత ఉసిరి రసం కలుపుకోని తాగడం వల్ల రక్తంలో బ్లడ్‌ షుగర్‌ స్థాయులు అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి. అదేవిధంగా అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా ఈజీగా దూరం చేసుకోవచ్చు.కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం ఇంకా అలాగే అజీర్ణం ఇతర కారణాల వల్ల కూడా జీవక్రియ రేటు కూడా మెరుగ్గా ఉండదు. ఇక అలాంటివారు గూస్బెర్రీ జ్యూస్ తీసుకోవడం చాలా మేలు. ఉసిరిలోని లక్షణాలు జీవక్రియను మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి. పైగా ఇది శరీరంలో శక్తిని కూడా పెంచుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.రోజుకు రెండుసార్లు కూడా ఉసిరి కాయ రసంని మీరు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో ఈ జ్యూస్ ని కనుక కలుపుకుని తీసుకుంటే మీరు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు మూడు టీస్పూన్ల ఉసిరి రసాన్ని కలుపుకుని మీరు తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: