అసలే ఇప్పుడు వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో అధిక వేడి, ఉక్కపోత కారణంగా శరీరం ఇంకా తలలో నుంచి తీవ్రంగా చెమటలు కారుతుంటాయి. అయితే ఒక్కోసారి చెమటల వల్ల జుట్టు బాగా తడిసి ముద్దవుతుంది.అందువల్ల దుర్వాసన కూడా వస్తుంటుంది. ఈ దుర్వాసన మనతో పాటు మన పక్కన వారిని కూడా చాలా అసౌకర్యానికి గురిచేస్తుంది. దాంతో ఇతరులు మన దగ్గరకు రావడానికే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఇలాంటి పరిస్థితి అయితే చాలా మందికే ఎదరై ఉంటుంది.ఇక మీకు ఇలానే జరిగిందా..? అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాలను ప్రయత్నిస్తే.. దెబ్బకు దుర్వాసనను పోగొట్టుకుని కేశాలను పరిమళంగా మార్చుకోవచ్చు. మరి లేటెందుకు ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక అర కప్పు రోజ్ వాటర్ పోయాలి.



ఈ రోజ్ వాటర్ లో ఐదారు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా ఐదారు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకొని.. తల స్నానం చేసిన తరువాత జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే చెడు వాసన పోయి జుట్టు చాలా సువాసనభరితంగా మారుతుంది.అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌ ఇంకా వన్ టేబుల్ స్పూన్ వేప నూనె అలాగే వన్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి. అర గంట లేదా నలబై నిమిషాల తరువాత మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో బాగా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా చేసినా ఈ సమస్యని చాలా ఈజీగా వదిలించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: