ఇక డైట్ లో ఉన్నప్పుడు ఓట్స్ కచ్చితంగా ఆహారంలో చేర్చుకుంటారు. ఇది కేవలం బరువు తగ్గడానికే కాదు..చర్మానికి అందాన్ని తేవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు ఇంకా అలాగే సిలికా చర్మానికి మంచి నాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.అలాగే ఓట్స్ తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోని ముఖానికి అప్లై చేసుకుంటే జిడ్డు, మచ్చలు, మొటిమలు అన్ని కూడా చాలా ఈజీగా పోతాయి. ఇక ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో చెంచా తేనె ఇంకా రెండు స్పూన్ల పాలూ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న గిన్నెలో కొన్ని ఓట్స్ తీసుకుని వాటికి టొమాటో గుజ్జుని చేర్చాలి. ఒట్స్ మొత్తబడి చిక్కని పేస్ట్ లాగా అయ్యాక ముఖానికి పట్టించాలి. ఒక పది నిమిషాలయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇక టొమాటో నలుపు దననాన్ని తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఓట్స్ లోని పీచు పదార్ధాలు జిడ్డుని ఈజీగా తొలగిస్తాయి. అప్పుడు ఫేస్ సూపర్ లుక్ వస్తుంది.రెండు స్పూన్ల ఓట్స్ లో సగం నిమ్మకాయ రసం ఇంకా అలాగే స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఒక పది నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లకు అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది.



నిమ్మరసం ఇంకా ఓట్స్ మిశ్రమం చర్మంలోని జిడ్డు తొలగించేందుకు సాయపడతాయి. ఆలివ్ నూనె చర్మాన్ని చాలా సున్నితంగా మారుస్తుంది.అలాగే మొటిమల నివారణకోసం రెండు చెంచాల ఓట్స్ ను నీళ్లలో లేదా పాలలో వేసి బాగా ఉడికించాలి. అది చిక్కని మిశ్రమం అయ్యాక తీసేసి.. కొద్దిగా చల్లారిన తరువాత ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక పావుగంట తరువాత గోరు వెచ్చని నీళ్లతో బాగా శుభ్రం చేస్తే చాలు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు వెంటనే తగ్గుముఖం పడతాయట.కాబట్టి ఈ సారి ఓట్స్ తో కూడా ఫేస్ ప్యాక్ ట్రే చేసి చూడండి. నిజానికి..ఇంటి చిట్కాలతోనే ఫేస్ కు ఉన్న సమస్యలన్నీ కూడా చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. ఇంకా వీటి వల్ల రిజల్ట్ కాస్త ఆలస్యం అయినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా చాలా మంచి ఫలితం ఉంటుంది. కెమికల్ ఉన్న క్రీమ్స్ వాడటం వల్ల ముఖానికి అనవసరమైన సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: