మొన్నటివరకు టీమిండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వృద్ధిమాన్ సాహా గత కొంతకాలం నుంచి మాత్రం భారత జట్టుకు పూర్తిగా దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కీపింగ్ నైపుణ్యంతో బ్యాటింగ్ ప్రతిభతో  ఆకట్టుకున్న వృద్ధిమాన్ సాహా గత కొంతకాలం నుంచి మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే దేశవాళీ క్రికెట్లో కూడా పలు వివాదాల్లో చిక్కుకోవడం తో వృద్ధిమాన్ సాహా పేరు హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. తాను ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఒక జర్నలిస్టు బెదిరించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి  వార్తల్లో నిలిచాడు వృద్ధిమాన్ సాహా.


 అదే సమయంలో ఇక దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టు తరఫున వృద్ధిమాన్ సాహా ఎన్నో ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇక ఇటీవలే ఆ జట్టు నుంచి తప్పుకోవడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. తనను అడగకుండానే బెంగాల్ జట్టు తరఫున ఎంపిక చేసి తనను అవమానించారని ఆరోపిస్తూ.. ఇక బెంగాల్ జట్టును వీడాడు వృద్ధిమాన్ సాహా. ఈ క్రమంలోనే తనకు వేరే జట్టు తరపున ఆడేందుకు నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశాడు.


 ఈ క్రమంలోనే ఇటీవలే టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు  బెంగాల్ క్రికెట్ సంఘం ఎన్ఓసి లెటర్ జారీ చేసింది. దీంతో బెంగాల్ క్రికెట్ సంఘం వృద్ధిమాన్ సాహా మధ్య ఉన్న పదిహేనేళ్ల బంధానికి తెరపడింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు బెంగాల్ క్రికెట్ సంఘం నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసిన నేపథ్యంలో ఇక మరో రాష్ట్రానికి ఆడేందుకు వృద్ధిమాన్ సాహాకు వీలుగా ఉంటుంది అని చెప్పాలి. కాగా 2007లో బెంగాల్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టాడు వృద్ధిమాన్ సాహా. ఇప్పటివరకు 122 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 102 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు వృద్ధిమాన్ సాహా.

మరింత సమాచారం తెలుసుకోండి: