ఆహారంలో ఎక్కువ కొవ్వు తీసుకోవడం ఇంకా హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి కారణంగా చర్మం జిడ్డుగా ఉంటుంది. యువతలో జిడ్డు చర్మం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆయిల్ స్కిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మంపై మొటిమల సమస్య అనేది మొదలవుతుంది.ఇక జిడ్డుగల చర్మాన్ని రోజువారీ శుభ్రపరచడం చాలా ముఖ్యం.జిడ్డు చర్మం ఉన్నవారు చర్మాన్ని బాగా శుభ్రం చేయడానికి క్లెన్సర్‌ని ఉపయోగిస్తారు. క్లెన్సర్ చర్మాన్ని చాలా లోతుగా శుభ్రపరుస్తుంది. చర్మంపై మొటిమలు ఇంకా అలాగే దుమ్మును కూడా తొలగిస్తుంది. ఇంకా అలాగే మార్కెట్‌లో లభించే కెమికల్ బేస్ క్లెన్సర్‌లను చర్మంపై ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.మీరు జిడ్డుగల చర్మం వారు అయితే మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇంట్లోనే మిల్క్ క్లెన్సర్‌ను సిద్ధం చేసుకోండి.ఇక ఇంట్లోనే మిల్క్ క్లెన్సర్‌ని ఎలా తయారు చేసుకోవాలో.. అలాగే చర్మానికి దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


ఇక చర్మానికి మంచి క్లెన్సర్‌లలో ఖచ్చితంగా పాలు ఒకటి. విటమిన్ ఎ ఇంకా విటమిన్ కె పాలలో ఉంటాయి. పాలు ముఖంపై పేరుకున్న దుమ్ము ఇంకా ధూళిని సులభంగా తొలగిస్తుంది.వేసవిలో, జిడ్డు చర్మంపై మురికిని ఈజీగా తొలగించి మీ చర్మం మెరిసేలా చేయడానికి మిల్క్ క్లెన్సర్‌ని ఉపయోగించండి.దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తూ ఇంకా మృదువుగా ఉంటుంది. పాలలో ఉండే ఎంజైమ్‌లు ముఖాన్ని బాగా శుభ్రపరుస్తాయి. టోన్ ఇంకా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి.పాలు ఇంకా అలాగే నారింజ తొక్క క్లెన్సర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 3-4 చెంచాల పచ్చి పాలను తీసుకోండి. తరువాత నారింజ తొక్కలను 2-3 రోజులు ఎండలో ఉంచి ఆరబెట్టి,ఆ తరువాత మిక్సీలో గ్రైండ్ చేసి దాని పొడిని మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు పాలలో ఒక చెంచా నారింజ తొక్క పొడిని వేసి బాగా కలపండి. తరువాత ఈ పేస్ట్‌ని బాగా కలపండి. అప్పుడు మీ ఫేస్ క్లెన్సర్ సిద్ధంగా ఉంది. ఈ పేస్ట్‌ను ప్రతిరోజూ కూడా మీ ముఖంపై క్లెన్సర్‌గా వాడండి, మీ ముఖం చాలా శుభ్రంగా ఉంటుంది. మీరు ముఖ మొటిమలను కూడా చాలా తొలగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: