వర్షాకాలంలో చర్మంపై మొటిమలు, దురద ఇంకా దద్దుర్లు వంటి అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి వేప మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వేప ఆకులను నీళ్లలో వేసి మరిగించి స్నానం చేయడం వల్ల చర్మపై ఏర్పడే అలర్జీలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. అయితే ఈ నీటిని రోజూ తయారు చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది. ఇక అటువంటి పరిస్థితిలో.. మీరు స్నానం చేసేటప్పుడు ఈ వేప సబ్బును ఉపయోగించవచ్చు. మార్కెట్‌లో వేప సబ్బు పేరుతో విక్రయించే సబ్బులపై అసలు నమ్మకం ఉండడం లేదు. కాబట్టి ఇంట్లో మీరే వేప సబ్బులను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వేప సబ్బు మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తుంది. ఇక ఈ రోజు వేప సబ్బు తయారీ గురించి తెలుసుకుందాం..వేప ఆకులు, గ్లిజరిన్ సబ్బు, విటమిన్ ఇ క్యాప్సూల్, నీరు ఈ సబ్బు తయారీకి ఒక అచ్చు తీసుకోండి, ఆ అచ్చు లేకపోతే కాగితం కప్పు లేదా చిన్న గిన్నె తీసుకోండి.ఇక ముందుగా వేప ఆకులను నీటితో శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. మీకు గ్రైండ్ చేయడంలో ఇబ్బంది కనుక ఉంటే, అవసరాన్ని బట్టి వేపాకుల్లో నీరు వేసి డాన్ని చాలా మెత్తగా పేస్ట్ చేయండి.


అలాగే ఒక గిన్నెలో లేదా ఏదైనా పాత్రలో తయారు చేసిన పేస్ట్‌ను వేసుకోండి.ఆ తరువాత గ్లిజరిన్ కలిగిన సబ్బుని చిన్న ముక్కలుగా కట్ చేయండి.. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి ఆ నీటిని బాగా వేడి చేయాలి. ఆ నీళ్లు కాస్త వేడి అయ్యాక అందులో ఖాళీ గిన్నె పెట్టి ఆ గిన్నెలో సబ్బు ముక్కలు వేయాలి. వేడితో, ఆ సబ్బు ముక్కలు కరగడం ప్రారంభమవుతాయి.ఇక అవి పూర్తిగా కరిగిన తర్వాత.. వేప ఆకుల పేస్ట్ ని జోడించండి. అలాగే విటమిన్ ఇ క్యాప్సూల్‌ని కట్ చేసి అందులో వేసి కాసేపు వేడెక్కనివ్వండి. ఇక దీని తరువాత, మీరు ఈ ద్రవాన్ని కాగితం కప్పులో, సాదా చిన్న గిన్నెలో లేదా ఒక అచ్చులో వేసుకోండి. అంతేకాదు మీకు నచ్చిన సబ్బు ఆకారం ఉన్న అచ్చుల్లో ఈ మిశ్రమాన్ని వేయండి.అది బాగా గడ్డకట్టిన తర్వాత, కత్తి సహాయంతో బయటకు తీసుకోవాలి. ఇంకా ఈ ఈ వేప సబ్బును క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా..మీరు చర్మానికి సంబంధించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: