ఇక పులిపిర్ల వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి చూడడానికి ఇవి అందవికారంగా ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి గాను చాలా మంది కూడా గిల్లడం, బ్లేడుతో కోయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే కొందరు పులిపిర్లను తొలగించే క్రీములను వాడుతూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాల ద్వారా కూడా మనం ఈ పులిపిర్లను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. సహజసిద్ధంగా పులిపిర్లను తొలగించే చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక అర టీ స్పూన్ తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ను మనం తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక టీ స్పూన్ ఆముదం నూనెను ఇంకా అర టీ స్పూన్ వంటసోడాను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మీ పులిపిర్ల మీద రాసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉండడం వల్ల చిన్న పరిమాణంలో ఉండే పులిపిర్లు ఇక 3 నుండి 7 రోజుల వ్యవధిలోనే రాలిపోతాయి. పెద్ద పరిమాణంలో ఉండే పులిపిర్లు 3 వారాల వ్యవధిలో చాలా ఈజీగా రాలిపోతాయి.ఇక ఈ చిట్కాను క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి.


సున్నితమైన చర్మం ఉన్న వారు మాత్రం ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మంపై సూది గుచ్చినట్టుగా అనే భావన కలుగుతుంది. కనుక వారు ఈ చిట్కాను పాటించకపోడమే చాలా మంచిది.ఇంకా అదే విధంగా పులిపిర్లను తొలగించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇందుకోసం మనం తమలపాకును ఇంకా తడి సున్నాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక తాజా తమలపాకును కాడతో సహా తీసుకోవాలి. తరువాత ఆ కాడను ఆకు నుండి వేరు చేయాలి. ఇలా వేరు చేసిన కాడతో తడి సున్నాన్ని తీసుకుని పులిపిర్ల మీద రాసి అదే కాడతో వాటిపై ఒక 3 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మూడు నుండి నాలుగు రోజుల్లోనే ఈ పులిపిర్లు ఈజీగా రాలిపోతాయి. ఇక ఈ చిట్కాలను పాటించడం వల్ల నొప్పి లేకుండా చాలా సులువుగా మనం పులిపిర్లను తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: