మీ జుట్టుని శుభ్రం చేసుకోవడానికి, ఒక టీస్పూన్ ఆపిల్ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. ఈ రెండింటినీ తీసుకొని బాగా కలపాలి. మీ జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత.. ఈ మిశ్రమంతో బాగా శుభ్రం చేసుకోండి. జుట్టులో pH స్థాయిని నిర్వహించడానికి బాగా సహాయపడుతుంది. మీ జుట్టు మెరుపును కూడా పెంచుతుంది.మీ జుట్టుని శుభ్రం చేసుకోవడానికి బ్లాక్ టీ కూడా మంది సహాయకారి. రెండు కప్పుల నీటిలో బ్లాక్ టీ బ్యాగ్‌లను కూడా ఉంచండి. ఒక రెండు గంటల పాటు అలా ఉంచిన తర్వాత.. జుట్టును షాంపూ చేసిన తర్వాత జుట్టును బాగా శుభ్రం చేసుకోండి. బ్లాక్ టీలో కెఫిన్ అనేది ఉంటుంది. దీని కారణంగా జుట్టు రంగు బాగా నల్లగా ఉంటుంది. మీరు దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు కూడా ఉపయోగించవచ్చు.ఇంకా కలబందను అనేక రకాల సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు మీరు కలబందను ఉపయోగించవచ్చు. దీని కోసం, అలోవెరా జెల్‌ను తీసుకొని నీటితో బాగా కలపండి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును అలోవెరా జెల్ తో బాగా శుభ్రం చేసుకోండి. ఇది జుట్టుకు మంచి కండిషన్‌గా కూడా పనిచేస్తుంది.


అలాగే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో నిమ్మరసంని కలపండి. రెండిటిని కూడా బాగా కలపండి. అనంతరం ఈ నీటితో జుట్టుని బాగా శుభ్రం చేసుకోండి. ఈ నిమ్మ నీటిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు మీరు ఉపయోగించవచ్చు. ఇక ఇది జుట్టు వేగంగా పెరిగేలా పనిచేస్తుంది. ఇది జుట్టు చిట్లకుండా కూడా కాపాడుతుంది.అలాగే బేకింగ్ సోడా కూడా జుట్టుని శుభ్రం చూసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. అందుకు ముందుగా మీరు ఒక గిన్నెలో నీటిని తీసుకోండి. దానిలో కొంచెం బేకింగ్ సోడా వేసి కలపండి. ఇప్పుడు జుట్టుకు షాంపూ చేసిన తర్వాత ఇంట్లో తయారుచేసిన ఈ హెయిర్ రిన్స్‌ని మీరు ఉపయోగించండి. ఈ హెయిర్ రిన్స్‌తో జుట్టును బాగా మసాజ్ చేయండి. అనంతరం చల్లటి నీటితో జుట్టును బాగా కడగండి. జిడ్డుతో ఉన్న జుట్టుకు మంచి రెమిడీ బేకింగ్ షోడా నీరు..

మరింత సమాచారం తెలుసుకోండి: