ఈ కాలంలో స్థూలకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. అయితే అందం ఇంకా అలాగే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే స్థూలకాయం నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఒత్తిడి ఇలా వివిధ కారణాలతో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. ఇదే సమస్య అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఒకేచోట కూర్చుని గంటల తరబడి పని చేస్తుండటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లోపిస్తోంది. దాంతో స్థూలకాయం అనేది బాగా పెరిగిపోతోంది. బరువు తగ్గేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీక్కూడా వేగంగా బరువు తగ్గించుకోవాలనుంటే.. కివీ, దానిమ్మ జ్యుస్ ట్రై చేస్తే మంచి ఫలితాలుంటాయి. దానిమ్మ, కివీ జ్యూస్‌లో ఉండే పోషక పదార్ధాలతో కొవ్వు వేగంగా కరుగుతుంది. స్థూలకాయం ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.కివీలో విటమిన్ సి అనేది చాలా సంపూర్ణంగా ఉంటుంది. కివీలో..నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది.


ఇంకా అంతేకాకుండా కివీలో పొటాషియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ కివీ సేవిస్తే శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. మీ బరువు సులభంగా తగ్గుతారు.దానిమ్మలో విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే దానిమ్మలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో విటమిన్ బి6, ఫోలేట్ పొటాషియం, ఐరన్ ఉంటాయి. అందుకే ప్రతిరోజూ దానిమ్మ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బరువు తగ్గించుకునేందుకు 2 కప్పుల దానిమ్మ, ఒక కప్పు కివీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంగా గాఢంగా ఉన్నట్టు అన్పిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల స్లిం గా అందంగా మారవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యూస్ తీసుకోండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: