ఇలా చేస్తే ముఖం అందంగా ఉంటుంది?

రాత్రిపూట అందానికి నిద్ర చాలా అవసరం. రాత్రి ఎంత బాగా కంటినిండా నిద్రపడితే ఉదయం అంత బాగా తాజాగా ఉంటుంది ముఖం. అందుకే అందరూ నిద్ర గొప్ప మెడిసిన్ అని అంటారు. ఉదయం ముఖం తాజాగా ఉన్నా రాత్రి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం డల్ గా ఉంటుంది.ఉదయం బయటకు వెళ్లిన తరువాత ఎండలోనూ, దుమ్ములోనూ తిరగడం వల్ల చాలా వరకు చర్మం ప్రభావానికి గురవుతుంది. ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ కు ఉపయోగించే విటమిన్ సి, మాశ్చరైజింగ్ క్రీమ్ వంటివి చర్మాన్ని కప్పి ఉంచి ఎండ, దుమ్ము నుండి నష్టాన్ని అడ్డుకుంటాయి. అయితే రాత్రి సమయంలో వీటిని ఉపయోగించే చర్మానికి తగిన పోషకాలు అందిస్తాయి.ఇలా చేస్తే ముఖం అందంగా ఉంటుంది.చాలామందికి రాత్రి పడుకునేటప్పుడు బానే ఉంటుంది కానీ ఉదయం లేవగానే కళ్ళ కింద వాచిపోయి ఉంటాయి. పడుకున్నపుడు కంటి కింద భాగంలో స్రావాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడే సమస్య అది. దాన్ని అధిగమించడానికి తల కింద రెండు దిండ్లు వేసుకుని పడుకోవాలి. ఎత్తువల్ల స్రావాలు పేరుకుపోకుండా ఉంటుంది.


రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో నైట్ క్రీమ్ వాడటం చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నైట్ క్రీమ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.అలాగే జుట్టు అందం కోసం రాత్రిపూట పడుకునేటప్పుడు జుట్టుకు కండిషనర్ అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలో జుట్టుకు మాశ్చరైజర్ రాయడం వల్ల అది జుట్టుకు పూర్తిగా ఇంకిపోయే సమయం ఉంటుంది.ఉదయానికల్లా జుట్టు సిల్కీగా మారుతుంది. ఇది మాత్రమే కాదు రాత్రిపూట జుట్టుకు నూనెతో మసాజ్ చేసి ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు బాగా మెరుస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఇంకా అలాగే కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: