కండలు తిరిగిన బాడీ కావాలంటే ఇలా చెయ్యండి ?

కండలు తిరిగిన బాడీ అనేది అబ్బాయిల డ్రీం. ఆ బాడీ కావాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులు శరీరంలో తలెత్తుతాయి. శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల బలహీనత, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయి. అయితే మంచి శరీర ఆకృతి కోసం రోజూ వ్యాయామం చేస్తూ మాంసాహారం తీసుకోవాలని కొంతమంది సూచిస్తారు. దీనివల్ల శరీర ఆకృతి అందంగా మారి.. ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపడుతుందని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మాంసాహారం కంటే శాఖాహారమే చాలామంచిదని చాలామంది ఆరోగ్య నిపుణులు రికమెండ్ చేస్తున్నారు. సాధారణంగా మాంసాహారం కంటే శాకాహారంలో తక్కువ ప్రోటీన్ ఉంటుందనుకుంటారు చాలా మంది. కానీ అది కరెక్ట్ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కొన్ని శాఖాహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


శనగలు తీసుకోవడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వీటిలో ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.పప్పుధాన్యాలు ఏవైనా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్నింటిలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావాలంటే రోటీ లేదా అన్నంతో వీటిని తినొచ్చు.బీన్స్‌లో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే దీనిని ఇష్టంగా తింటారు. బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కావాలంటే వీటిని ఉడకబెట్టి కూడా తినవచ్చు.ఇంకా అలాగే పనీర్ చాలా పాపులర్ ఫుడ్. దీనలో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా ఇందులో మంచి మొత్తంలో కాల్షియం కూడా ఉంటుంది. మీ ఆహారంలో పన్నీర్ తప్పనిసరిగా చేర్చకుంటే బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: