చాలా మందికి కూడా చిన్న వయసులోనే ముఖంపై ముడతలు పడతాయి. వాటిని పోగొట్టుకోడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.ఇక మనకు ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ద పదార్థాలతో ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకుని వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవడంతో పాటు చర్మం పై ఉండే ముడతలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. చర్మంపై వచ్చే ముడతలను తొలగించే ఫేస్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ ప్యాక్ తయారీ కోసం  మనం ఒక టీ స్పూన్ మైదాపిండిని, అర టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ పెరుగును, ఒక టీ స్పూన్ నిమ్మ తొక్కల పేస్ట్ ను తీసుకోవాలి. ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకొని... తరువాత పైన తెలిపిన మిగిలిన పదార్థాలన్నీ కూడా కలిపి మెత్తగా పేస్ట్ లా కలుపుకోవాలి. ఇంకా మిశ్రమాన్ని చేత్తో కానీ, బ్రష్ తో కానీ ముఖానికి చక్కగా శుభ్రంగా ఫ్యాక్ లా వేసుకోవాలి.


ఇక ఈ మిశ్రమాన్ని  వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఫ్యాక్ వేసుకున్న ఒక గంట తరువాత ముఖాన్ని చల్లటి నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ టిప్ ని క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేయడం వల్ల ముఖం పై వచ్చిన ముడతలు అన్ని కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ టిప్ ని వాడడం వల్ల చర్మం పై ఉండే మలినాలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అంతేకాకుండా మొటిమలు, మచ్చలు, నల్లదనం తొలగిపోయి ముఖం అందంగా, ఇంకా అలాగే కాంతివంతంగా తయారవుతుంది. ఈ టిప్ ని పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవే లేకుండా ముఖంపై ఉండే ముడతలను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. ఇంకా అలాగే ముఖాన్ని కూడా చాలా అందంగా మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: