చాలా మందికి కూడా మెడ మీద లేదా మెడ కింద నల్లగా ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా లేదా ఎన్ని క్రీములు వాడినా అస్సలు పోదు. అయితే మన ఇంట్లోనే న్యాచురల్ మాయిశ్చరైజర్ ను తయారు చేసుకొని దానితో ఈజీగా ఈ సమస్యను పోగొట్టుకోవచ్చు. దీన్ని ప్రతి రోజూ కూడా చర్మానికి రాసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ లభించి చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చే మాయిశ్చరైజర్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం. మీరు ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను వేయాలి. ఆలివ్ నూనెకు బదులుగా మనం బాదం నూనెను కూడా యూజ్ చెయ్యొచ్చు.ఇక ఇలా మీరు ఆలివ్ నూనెను తీసుకున్న తరువాత ఇందులో 5 చుక్కల గ్లిజరిన్ ను వేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని ఇంకా ఒక టీ స్పూన్ కలబంద జెల్ ను వేసి బాగా కలపాలి.


ఇలా చేయడం వల్ల ఈ న్యాచురల్  మాయిశ్చరైజర్ తయారవుతుంది. దీనిని ప్రతి రోజూ కూడా రాత్రి చేతులకు, కాళ్లకు, మెడకు రాసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ లభించి చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. దీనిని వాడడం వల్ల చర్మం పై ఉండే ముడతలు, మృత కణాలు ఇంకా అలాగే నలుపుదనం తొలగిపోయి చర్మం చాలా అందంగా తయారవుతుంది. ఆలివ్ నూనెలో అలాగే కలబంద జెల్ లో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మాయిశ్చరైజర్ ను వాడడం వల్ల చర్మం పై ఎండ వల్ల కలిగిన నలుపు చాలా ఈజీగా తొలగిపోయి చర్మం బాగా తెల్లగా మారుతుంది. బయట ఎక్కువ ధరలకు కొనుగోలు చేసే పని లేకుండా ఇలా మాయిశ్చరైజర్ ను ఈజీగా న్యాచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: