కొంతమంది, ముఖం, పాదాలు, చేతులు, మెడ నల్లగా మురికిగా ఉంటాయి. ఈ సమస్యకు మనం కొన్ని ఇంటి చిట్కాలతో చాలా ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు. మన ఇంట్లోనే సింపుల్ గా ఒక ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల నల్లగా ఉన్న పాదాలు చాలా ఈజీగా తెల్లగా అవుతాయి.ఇక ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. పాదాలను తెల్లగా మార్చే టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా అలాగే దాని తయారీకి కావల్సిన పదార్ధాలు ఇంకా అలాగే ఈ ప్యాక్ ను ఎలా వాడాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా మనం శనగపిండిని,పెరుగును, నిమ్మరసాన్ని, మైసూర్ పప్పు పొడిని వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం మనం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఆ తరువాత అందులో రెండు టీ స్పూన్ల పెరుగును వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో అర స్పూన్  నిమ్మరసాన్ని వేసుకోవాలి. చివరిగా ఇందులో ఒకటిన్నర టీ స్పూన్  మైసూర్ పప్పు పొడిని వేసి అన్నీ బాగా కలిసేలా  కలపాలి. అయితే ఈ మైసూర్ పప్పు పొడి మరీ మెత్తగా ఉండకుండ చూసుకోవాలి.


ఇలా తయారు చేసుకున్న ప్యాక్ ను వాడటానికి ముందు మీ పాదాలను ఖచ్చితంగా చాలా శుభ్రంగా కడుక్కోవాలి.తరువాత చేత్తో లేదా బ్రష్ తో ఈ మిశ్రమాన్ని తీసుకొని నల్లగా వున్న చోట మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా రాసుకోవాలి. ఇక ఇలా  రాసుకున్న మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత కొద్ది కొద్దిగా నీటితో తడి చేస్తూ సున్నితంగా మర్దనా చేసి తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మృతకణాలు, దుమ్ము ధూళి ఇంకా అలాగే మురికి ఎండ వల్ల ఏర్పడిన నలుపు పూర్తిగా తొలగిపోయి మీ చర్మం చాలా కాంతివంతంగా తయారవుతాయి. ఈ ప్యాక్ ను  పాదాలు, చేతులు, కాళ్లు, ముఖం, మెడ వంటి భాగాలపై కూడా రాసుకోవచ్చు.ఇక ఈ ప్యాక్ ను వాడిన తరువాత ఆ రోజంతా సబ్బును అస్సలు ఉపయోగించకూడదు. అలాగే ప్యాక్ ను తొలగించిన తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ కానీ కొబ్బరి నూనెను కానీ అప్లై చెయ్యాలి. ఈ ప్యాక్ ను వాడడం వల్ల చర్మం పై ఉండే ముడతలు చాలా ఈజీగా తొలగిపోయి చర్మం బిగుతుగా ఇంకా అలాగే కాంతివంతంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: