ఉసిరి రసంలో దూదిని ముంచి ముఖానికి టోనర్ లాగా అప్లై చేస్తే మెరిసిపోవడం ఖాయం.అయితే, ఇలా  రోజువారీ చేయకండి. అందుకు బదులుగా వారానికి 2, 3 సార్లు మాత్రమే చేస్తే సరిపోతుంది.దాని ఫలితంగా మీ ముఖంపై వుండే మచ్చలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇక అలాగే మీ చర్మాన్ని శుభ్రపరచడానికి ఉసిరి, బొప్పాయి కలిపి ఫేస్ ప్యాక్ ని కూడా తయారు చేసుకోవచ్చు. మీరు 2 టీస్పూన్ల ఉసిరి రసం తీసుకుని అందులో 2 టీస్పూన్ల బొప్పాయి గుజ్జును వేసి బాగా కలపాలి. ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఆపై ఒక 15 నిమిషాల దాకా ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడిగేయాలి.ఇలా మీరు వారానికి ఒకసారి చేసుకోవచ్చు. అందువల్ల ఎప్పుడు బాగా మెరిసేలా మీ ముఖం కనిపిస్తుంది.ఇంకా అలాగే ఈ ఉసిరిని చర్మంపై రుద్దుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చెంచా ఉసిరి పొడి, అర చెంచా పంచదార ఇంకా అలాగే ఒక చెంచా రోజ్ వాటర్ ని కలపాలి.


ఇక సున్నితంగా దానిని స్క్రబ్ చేసిన తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం అనేది ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇంకా అలాగే చనిపోయిన చర్మ కణాలనేవి ఈజీగా చర్మం నుంచి తొలగిపోతాయి.అలాగే మొటిమల మచ్చలు తొలగించడమే కాక అవి రాకుండా చేయడంలో కూడా సహాయపడుతుంది.ఇంకా అలాగే మెరిసే చర్మం కోసం ఉసిరి, పెరుగు ఇంకా తేనెతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. రెండు చెంచాల ఉసిరి పొడిని ఒక చెంచా పెరుగు ఇంకా ఒక చెంచా తేనెతో బాగా కలపండి. దీన్ని బాగా కలిపి ముఖానికి బాగా పట్టించాలి.ఒక 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు మీ ముఖంలో ఖచ్చితంగా మంచి మెరుపు కనిపిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ టిప్స్ పాటించండి. మీ ముఖం ఎల్లప్పుడూ కూడా బాగా మెరిసిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: