చలి కాలం చర్మ సమస్యలకి చెక్ పెట్టే ఈజీ టిప్:

చలి కాలంలో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు చర్మ సమస్యలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. అందుకే ఈ సమస్యలని పోగొట్టుకోడానికి కొబ్బరి నూనె వాడాలి. మన చర్మంపై కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల , చర్మం తేమగా ఉంటుంది, అలాగే ఎన్నో రకాల చర్మ సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ కొబ్బరి నూనెలో చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్, ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంకా అలాగే యాంటీ మైక్రోబియల్, విటమిన్-ఇ, విటమిన్-కె వంటి అంశాలు ఉంటాయి. కాబట్టి చలికాలంలో చర్మానికి కొబ్బరినూనెను రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చలి కాలంలో పెదవులు  పొడిగా మారతాయి, దాని కారణంగా పెదవులకు ఖచ్చితంగా పగుళ్లు ఏర్పడతాయి.అందుకే ఈ చలికాలంలో పెదవులపై కొబ్బరి నూనె రాసుకుంటే పెదాలు మృదువుగా మారడంతో పాటు పగిలిపోకుండా కూడా ఉంటాయి.చలికాలంలో కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. 


ఎందుకంటే కొబ్బరి నూనెలో విటమిన్ ఇ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది చర్మానికి పోషణను అందించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఇంకా కాంతివంతంగా ఉంచుతుంది.చలికాలంలో మొటిమలు ఇంకా మచ్చల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలని తొలగించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఇది మొటిమలు ఇంకా మచ్చలు వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.ఇంకా ఈ చలికాలంలో ఎండలో కూర్చోవడం వల్ల టానింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో టానింగ్ సమస్య ఉన్నప్పుడు చర్మానికి కొబ్బరినూనె రాసుకుంటే టానింగ్ సమస్య నుంచి మీకు చాలా ఈజీగా విముక్తి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: