అందంగా ఉండటంలో పెదాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి పెదాలు పగిలిపోతే ముఖం చాలా అందవిహీనంగా కనిపిస్తుంది.ఇక పెదవులు పగలడం అనేది చాలా సాధారణ విషయం. చాలా మంది కూడా ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనే ఉంటారు. పెదవులు పగిలిపోతే అందాన్ని కూడా కోల్పోతారు. అందువల్ల తమ పెదాల అందం కోసం చాలా మంది కూడా మార్కెట్లో దొరికే మాయిశ్చైజర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.అయితే కొన్ని సందర్భాల్లో వీటిలో ఉండే కెమికల్స్ వల్ల పెదవులకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అంతే కాకుండా ఈ చలిలో నేచురల్‌గా ఇంట్లో లభించే పదార్ధాలతో పగిలిన పెదవులకు చాలా ఈజీగా చెక్‌ పెట్టొచ్చు. మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో తేనె చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. ఈ తేనె బెస్ట్‌ నేచురల్‌ మాయిశ్చరైజర్‌గా సహాయపడుతుంది.


ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్‌ లక్షణాలను ఇన్ఫెక్షన్లను చాలా ఈజీగా తగ్గిస్తాయి. అందుకే మీ పెదవులపై కొంత తేనెను పూయాలి. ఆ తరువాత కొంచెం సమయం తర్వాత తేనెను తొలగిస్తే ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా కొబ్బరి నూనె కూడా సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌ అని ఈజీగా చెప్పొచ్చు. ఇందులోని ఫాటీ యాసిడ్స్‌ హైడ్రేట్ స్కిన్‌పై చాలా ప్రభావితంగా పనిచేస్తుంది.ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను కొంత తీసుకొని మీ పెదాలపై అప్లై చేసి కాసేపటి తర్వాత తుడ్చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.చలికాలంలో పెదాలను కాపాడడంలో నిమ్మకాయ కూడా చాలా మంచి ఫలితాలన్ని ఇస్తుంది. కొంచెం తేనే ఇంకా అలాగే నిమ్మకాయ కలిపి మీ పగిలిన పెదాలకు కనుక అప్లై చేసుకుంటే మీ పెదాలు చాలా స్మూత్‌గా ఇంకా అందంగా మారుతాయి.కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ టిప్స్ పాటించండి. మీ పగిలిన పెదాలను చాలా అందంగా ఇంకా అలాగే సాఫ్ట్ గా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: