తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంద‌మూరి తార‌క రామారావు త‌ర్వాత ఆ స్థాయిలో అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టుడు చిరంజీవి. క్రేజీ హీరోగా ప్ర‌ఖ్యాతిగాంచాడు.80, 90ద‌శ‌కంలో చిరంజీవి స్టార్‌డ‌మ్‌తో ఓ వెలుగు వెలిగారు. త‌న డ్యాన్స్‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను అల‌రించారు. ఇప్ప‌టికీ యువ క‌థానాయ‌కుల‌తో త‌న డ్యాన్స్‌తో స‌వాల్ విసురుతున్నారు. చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది.  మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు.


మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిల‌దొక్కుకున్నాడు. ఆ సినిమా త‌ర్వాత చిరంజీవి వెన‌దిరిగి చూడ‌లేదు. త‌ర్వాత వ‌చ్చిన చంటబ్బాయ్, ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి.  గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.


తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు. 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పథంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది.రాజ‌కీయాల్లో ప్ర‌వేశం, స్వ‌స్తి త‌ర్వాత ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యి చిరు రీ ఎంట్రీ ఘనంగా సాగింది. అలాగే సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా అయితే మెగాస్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లో న‌టించే బిజిలో చిరంజీవి ప‌డ్డారు. ఓ సినిమాలో ఇప్ప‌టికే న‌టిస్తుండ‌గా.. మ‌రో రెండు సినిమాల‌కు ఆయ‌న సైన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఏదీ ఏమైనా తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల‌పై చెర‌గని ముద్ర వేసిన మెగాస్టార్ ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని హెరాల్డ్ కోరుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: