సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నటీమణుల్లో ముగ్ధ మనోహర రూపం మీనా. మీనా సౌత్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ నటులలో ఒకరు. ఆమె సినిమాలు దేశవ్యాప్తంగా ప్రజలలను అలరించాయి, ఆకట్టుకున్నాయి. ఆమె 1982 లో "నెంజంగల్‌" చిత్రంతో తెరపైకి వచ్చింది. ఆమె సుదీర్ఘ కెరీర్‌ లో మీనా అనేక కమర్షియల్ గానూ, ఇటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలోనూ కనిపించింది. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలు పోషించిన తరువాత ఆమె 1990లో రాజేంద్ర ప్రసాద్ నటించిన "నవయుగం" చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్యూటీ ఉత్తమ చిత్రాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

సీతారామయ్య గారి మనవరాలు
అక్కినేని నాగేశ్వరరావు, మీనా, రోహిణి నటించిన "సీతారామయ్య గారి మనవరాలు" ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. దీనికి క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు మరియు విఎంసి ప్రొడక్షన్స్ పతాకంపై వి దొరస్వామిరాజు నిర్మించారు. తన కుటుంబ సమస్యలను తీర్చడానికి భారతదేశానికి వచ్చిన ఎన్నారై అమ్మాయి సీత పాత్రకు మీనా ఉత్తమ నటి నంది అవార్డును గెలుచుకుంది.

చంటి
"చంటి" సినిమాలో వెంకటేశ్, మీనా నటించారు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చిత్రంలో నటనకు గానూ మీనా ఉత్తమ నటి ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అమాయకపు చంటి, భూస్వాముల సోదరి మధ్య అమాయకమైన ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంగీతం సోల్. మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్, మీనా నటనను ఎప్పటికి మర్చిపోలేరు.  

సూర్యవంశం
సూర్యవంశం చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. మీనా న్యాయమూర్తి కుమార్తె స్వప్న పాత్రలో నటించింది. నిరక్షరాస్యుడైన భాను ప్రసాద్‌తో ప్రేమలో పడి, వివాహం తరువాత, అతను ఆమెను ఐఏఎస్ అధికారిణిగా మారడానికి తోడుగా నిలుస్తాడు. ఇది తమిళ చిత్రానికి రీమేక్. రాధిక, సంఘవి, సత్యనారాయణ కూడా ఇందులో నటించారు, ఈ చిత్రానికి సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచారు.

మా అన్నయ్య
"మా అన్నయ్య" తమిళ చిత్రం 'వానటైపోల' రీమేక్. దీనికి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోరాజశేఖర్, మీనా, మహేశ్వరి, ప్రీతా విజయకుమార్ దీప్తి భట్నాగర్, నాసర్, బ్రహ్మాజీ, వినీత్, రామ ప్రభ, సుధాకర్ నటించారు. బెల్లంకొండ సురేష్, సింగనమల రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి అన్న ఇవర్గాల నుంచి ప్రశంసలు కురిశాయి. సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.

దృశ్యం
వెంకటేశ్, మీనా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. శ్రీప్రియ దర్శకురాలు. మలయాళ చిత్రం "దృశ్యం"కు ఇది రీమేక్. ఫ్యామిలీని సమస్యల నుంచి ఎలా కాపాడుకున్నారు అనేదే కథ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ రీమేక్ రెడీ అవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: