బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. 1942 లో జన్మించిన అమితాబ్ అక్టోబర్ 11న 79 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనేక మైలురాళ్లను చూశాడు. ఆయన సూపర్ హిట్ సినిమాలు సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు అమితాబ్ వరుస ఫ్లాప్ చిత్రాల ఒత్తిడిని కూడా ఎదుర్కోక తప్పలేదు. రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా తన కెరీర్‌ను ప్రయత్నించిన అమితాబ్, రాజకీయాల్లో ఎక్కువ సమయం గడపకపోవచ్చు, కానీ 8 వ లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం అలహాబాద్ నుంచి యూపీ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌ఎన్ బహుగుణను ఓడించారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకు.

అమితాబ్ తండ్రి ప్రముఖ కవి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్. ఆయన తల్లి తేజి బచ్చన్ కరాచీకి చెందినవారు. ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ చిన్నప్పుడు ఇంజనీర్ కావాలని లేదా వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. తానొకటి తెలిస్తే విధి ఒకటి తలచింది. ఫలితంగా అమితాబ్ చిత్ర పరిశ్రమకు షెహన్షా అయ్యాడు. హిందీ సినిమా వెండితెరపై అమితాబ్ పొందిన గుర్తింపు, కీర్తిని ప్రతి నటుడు కోరుకుంటాడు. ఆయన బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన, ప్రముఖ నటుడిగా ఇప్పటికీ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు.

ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అమితాబ్ వరుసగా 12 ఫ్లాప్ చిత్రాలను కూడా ఇచ్చారు. ఆయన భారీ వాయిస్ కారణంగా ఆల్ ఇండియా రేడియోలో తిరస్కరణకు గురయ్యాడు. కానీ అదృష్టం "జంజీర్" చిత్రం రూపంలో ఆయనను నిలబెట్టింది. ఆ చిత్రం అమితాబ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అమితాబ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: