ప్రముఖ చిత్రనిర్మాత యశ్ చోప్రా 'డర్' చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించగా, షారూఖ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించాడు. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత సన్నీ డియోల్ చాలా కోపంగా ఉన్నాడని, షారుఖ్ ఖాన్‌తో దాదాపు 16 సంవత్సరాలు మాట్లాడలేదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు సన్నీ డియోల్ 65 వ పుట్టిన రోజు. ఈ బాలీవుడ్ నటుడి పుట్టినరోజు సందర్భంగా సన్నీ డియోల్ షారుఖ్ ఖాన్‌తో 16 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు ? అనే విషయాన్నీ తెలుసుకుందాం. నిజానికి సన్నీ డియోల్ కోపానికి కారణం 'డర్' సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర.

'డర్' సినిమా సమయంలో తన పాత్రను చిత్రీకరించిన విధానం, షారుఖ్ ఖాన్ పాత్ర రాహుల్ మెహ్రా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కోపం వచ్చిందని ఆయన చెప్పాడు. ఆ చిత్ర దర్శకుడు యశ్ చోప్రాతో తన అసంతృప్తిని తెలియజేయడానికి 'డర్' సినిమా సెట్స్‌కి వెళ్లినన్నీ రోజులు చాలా కోపంగా ఉన్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి తాను ఏమాత్రం అంగీకరించలేదని సన్నీ డియోల్ వెల్లడించాడు. సన్నీ డియోల్ మాట్లాడుతూ 'ఆ సన్నివేశం గురించి నేను యష్ చోప్రాతో వాగ్వాదానికి దిగాను. నేను సినిమాలో కమాండో అధికారిని. కాబట్టి ఈ వ్యక్తి నన్ను సులభంగా ఎలా ఓడించగలడు? నేను అతనిని చూడకపోతే  అతను నన్ను ఓడించగలడు. నన్ను చూస్తూ పొడిచి చంపగలిగితే నన్ను కమాండో అని పిలుస్తారు ? అని ప్రశ్నించాను. కానీ ఈ విషయాలకు యష్ చోప్రా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అతను కోరుకున్నది చేశాడు" అని చెప్పుకొచ్చాడు. ఇది సన్నీ డియోల్‌కి చాలా కోపం తెప్పించిం. ఆ కోపంలో ఆయన తన ప్యాంటును చించేసుకున్నాడట. సినిమా విడుదలై సూపర్ హిట్. కానీ చిత్రం విడుదలైన తర్వాత సన్నీ డియోల్ షారుఖ్‌తో 16 సంవత్సరాలు మాట్లాడలేదు. షారుక్ సన్నీ డియోల్‌తో మాట్లాడలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: