ఆది 7వ తరగతి వరకు చెన్నైలోని పద్మా శేషాద్రిలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆపై హైదరాబాద్‌లోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌కు వెళ్లి ఇంటర్మీడియట్ కోసం సెయింట్ జాన్స్ తర్వాత భవన్స్ వివేకానంద కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన చదువులో కూడా బాగా రాణించాడు. తరువాత తండ్రి నటుడు కావడంతో ఆయన కూడా నటన వైపు మొగ్గు చూపాడు. క్రికెట్లో ఆల్ రౌండర్... అతను అండర్-19 రంజీ క్రికెట్ టీమ్‌కి ఎంపికయ్యాడు. అంతేకాదు అంబటి రాయుడు కెప్టెన్సీలో ఆడాడు. క్లైమాక్స్‌లో భారత జట్టు ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా శ్రీలంక పర్యటనలో అతని రూమ్మేట్గా ఉన్నాడు. ఆది డిసెంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది.
ఆది 2011లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో ప్రేమ కావాలి సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలల్లో నటిస్తున్నారు. ఈ యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సరికొత్త జోనర్లలో సినిమాలు చేస్తూ ఎక్కువగా ప్రతిభావంతులైన యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆది సాయి కుమార్ కిట్టిలో అతిథి దేవోభవ, బ్లాక్, అమరన్, కిరాతక వంటి సినిమాలు ఉన్నాయి. ఇక హీరోకు చాలా కాలంగా హిట్ అనే మాట దూరమైంది. మరి విభిన్నమైన చిత్రాలతో ప్రయత్నాలు చేస్తున్న ఈ హీరో ప్రయోగాలు ఎంత మేరకు ఆకట్టుకుంటాయి చూడాలి. వరుస చిత్రాల్లో ఆది ఏ సినిమాతో హిట్ అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడో చూద్దాం.