దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కుమార్తె, బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఈరోజు (డిసెంబర్ 29) తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు ట్వింకిల్ ఖన్నా మరియు ఆమె తండ్రి పుట్టినరోజు, అయినప్పటికీ రాజేష్ ఖన్నా మనందరి మధ్య లేరు. ట్వింకిల్ ఖన్నా 29 డిసెంబర్ 1973న జన్మించింది. ఈ నటి తన సినీ కెరీర్‌లో కేవలం 14 సినిమాలు మాత్రమే చేసింది. అయితే, ట్వింకిల్‌కి పరిశ్రమలో భిన్నమైన గుర్తింపు ఉంది.

ట్వింకిల్ ఖన్నా 1995 సంవత్సరంలో బాబీ డియోల్ సరసన 'బర్సాత్' చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ చిత్రం బాక్స్ వద్ద పెద్ద హిట్‌. ట్వింకిల్ తన తొలి చిత్రానికి ఫిలింఫేర్ తొలి ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ట్వింకిల్ తన కెరీర్‌లో చాలా చిత్రాలలో పని చేసింది. కానీ ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకంగా నిలవలేదు. తన చలనచిత్ర జీవితంలో ట్వింకిల్ తన భర్త అక్షయ్ కుమార్‌తో కలిసి 'ఇంటర్నేషనల్ ఖిలాడి', 'జుల్మీ' అనే రెండు చిత్రాలను కూడా చేసింది. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీనితో పాటు, ట్వింకిల్ తన చిన్న నటనా జీవితంలో బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లతో కలిసి పని చేసింది. ట్వింకిల్ సల్మాన్‌ తో 'జబ్ ప్యార్ కిసీ కే సాత్ హోతా హై', షారుఖ్ ఖాన్‌తో 'బాద్షా' చిత్రం, అమీర్ ఖాన్‌తో 'మేళా' చిత్రంలో చేసింది.

ట్వింకిల్ ఖన్నా హిందీ సినిమా సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరూ ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ సమయంలో కలుసుకున్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ట్వింకిల్ రెండుసార్లు నిశ్చితార్థం చేసుకుంది, కుటుంబ కారణాల వల్ల ట్వింకిల్, అక్షయ్‌ల మొదటి నిశ్చితార్థం బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత వారిద్దరూ మళ్లీ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ 2001 జనవరి 17న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ప్రస్తుతం ట్వింకిల్ ప్రస్తుతం ఆరవ్, నితారా అనే ఇద్దరు పిల్లలకు తల్లి.

పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన ట్వింకిల్ మిసెస్ ఫన్నీబోనస్ మూవీస్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. నటనకు విరామం ఇచ్చిన తర్వాత, ట్వింకిల్ 'మిసెస్ ఫన్నీబోన్స్ మరియు ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్' అనే రెండు నవలలు రాశారు. రెండు పుస్తకాలకు మంచి ఆదరణ లభించింది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: